హైదరాబాదులో బస చేసిన ఓ ఎన్నారై మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నారై మహిళ కర్ణాటక రాజధాని బెంగళూర్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె పని మీద హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఆ మహిళ హైదరాబాదులోని హరిద్వార్ హోటల్లో బస చేసింది. ఆ హోటల్ కు చెందిన ఉద్యోగి ఆమె అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆ ఉద్యోగిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.