వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవినీతిపై పోరు, ఎన్నారైల మార్చ్

రెండు సెగ్మెంట్లలో దండి మార్చ్ 2 పూర్తయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని 19 నగరాల గుండా 130 మైళ్లు సాగి యాత్ర బే ఏరియాకు చేరుకుంది. ఇండియా అగెయినెస్ట్ కరప్షన్, పీపుల్ ఫర్ లోక్‌సత్తా, యూత్ ఫర్ బెట్టర్ ఇండియా, ఫిఫ్త్ పిల్లర్, భారత్ స్వాభిమాన్, శంకర ఐ ఫౌండేషన్, ఓరుమా, ఇండో ముస్లిం అసోసియేషన్, టిఎఎస్సి, సేవ్ ఇండియా ఫ్రమ్ కరప్షన్, సాకు, లైఫ్ ఎసెన్స్ అకాడీ, జాగో సంస్థలు ఆ మార్చ్‌కు మద్దతు ప్రకటించాయి. ఆరుగురు భారత ఎన్నారైలు 240 మైళ్ల యాత్ర సాగిస్తున్నారు.
తుది దశ మార్చ్ 110 మైళ్లు సాగుతుంది. అది ఈ నెల 26వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి కెనడా వాంకోవర్ సౌత్ పార్లమెంటు సభ్యుడు ఉజ్జల్ దోశాంజ్ హాజరవుతారు. అదే రోజు ప్రపంచంలోని 50 నగరాల్లో సంఘీభావ యాత్రలు జరుగుతాయి.