అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

సతీష్‌రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఆదివారం ఉదయం సొంతూరైన కేశిరెడ్డిపల్లికి వ్యవసాయ పని నిమిత్తం వచ్చాడు. అతనికి గుండెపోటు ఉండటంతో కొడుకు మరణించిన వార్తను అతనికి చెప్పకుండా ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సతీష్‌రెడ్డి భార్య, నాలుగేళ్ల కొడుకుతో కాలిఫోర్నియాలో ఉంటున్నారు.
సతీష్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, కార్యదర్శి రాంమోహన్ కొండా, వర్జీనియా ప్రాంతీయ సమన్వయకర్త మనోహర్ ఎనుగు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.