• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు ఉగాది రచనల పోటీ

By Pratap
|
NRI
గత 15 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది ((ఏప్రిల్ 4, 2011) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 16వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. విదేశాలలో తెలుగు భాషనీ, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ,మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరినీ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా ఫౌండేషన్ ప్రతినిధి చిట్టెన్ రాజు కోరారు. విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇస్తామని ఆయన చెప్పారు.

ఉత్తమ కథానిక: (రెండు బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
నా మొట్ట మొదటి కథ: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116
నా మొట్ట మొదటి కవిత: (రెండు బహుమతులు): ఒక్కొక్కటీ: $116

ఈ సంవత్సర ప్రత్యేకం - "నా మొట్ట మొదటి కథ", "నా మొట్టమొదటి కవిత"గత సంవత్సరం జరిగిన 15వ ఉగాది పోటీలో ప్రవేశపెట్టిన "నా మొట్టమొదటి కథ" ప్రక్రియకి మంచి స్పందన వచ్చింది. ఆ స్పూర్తితో ఈ సంవత్సరం కూడా ఆ ప్రక్రియలో పోటీని కొనసాగిస్తూ, "నా మొట్టమొదటి కవిత" అనే నూతన ప్రక్రియలో కూడా పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఆధునిక కవిత, ఛందోబధ్ధమైన కవితలూ, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమేనని అన్నారు. కథలూ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తమ మొట్టమొదటి రచనగా పేర్కొంటూ, నూతన రచయితలందరినీ ఈ రెండు ప్రక్రియలలోనూ తమ అముద్రిత స్వీయ రచనలని పంపించమని కోరుతున్నట్లు తెలిపారు.

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
· ఇది వరకటి 15 పోటీల వలే కాకుండా, ఈ సారి ఉగాది తేదీకి నెల రోజుల ముందే మీ రచనలు పంపించాలి.
· అన్ని రచనలూ మాకు చేరవలసిన ఆఖరి రోజు మార్చ్ 4, 2011.
· ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది.
· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
· విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు.
· బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది అంతర్జాల పత్రికలోనూ, "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, వారి నిర్ణయానుగుణంగానూ ప్రచురించబడతాయి.
· ఫలితాలు ఉగాది పర్వదినాన (ఏప్రిల్ 4, 2011) కానీ అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోపుగా తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని రచయితలను కోరుతున్నాం.
· విజేతల ఎన్నిక లోనూ, ఇతర విషయాలలోనూ నిర్వాహకులదే తుది నిర్ణయం.

రచనలు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 4, 2011)
ఫలితాలు ప్రకటించే తేదీ: ఏప్రిల్ 4, 2011 (ఉగాది)

రచనలను rvanguri@wt.net, and copy to phspvr@physics.emory.edu అనే ఇ - మెయిల్‌కు గానీ 1866 222 5301అనే నెంబర్‌కు ఫాక్స్ ద్వారా గానీ Vanguri Foundation of America,
P.O. Box 1948, Stafford, TX 77497 అనే చిరునామాకు పోస్టు ద్వారా గానీ పంపవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Ugadi Contest for Creative Writing in Telugu

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more