వాలంటీర్ల అభినందన విందు

ATA
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాలంటీర్ల అభినందన కోసం విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఆగస్టు 25వ తేదీ సాయంత్రం జిఎ అల్ఫారెట్టాలోని అట్లాంటా బృందావన్ హోటల్లో జరిగింది. దీనికి దాదాపు 400 మంది హాజరయ్యారు. ఆటా 12వ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన వాలంటీర్ల సేవలను గుర్తించడానికి ఈ సమావేశం జరిగింది. వాలంటీర్లకు ఆటా 2012 సమ్మేళనం కమిటీ 260 ట్రోఫీలను బహూకరించింది. ఆటా 12వ సమ్మేళనం జులై 6 నుంచి 8వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే.

ప్రశాంతి అసిరెడ్డి ముందుగా మాట్లాడారు. సమ్మేళనం కమిటీ సభ్యులను, అడ్‌హాక్ కమిటీ సభ్యులను, అటెండీలను ఆమె పరిచయం చేసారు. సమ్మేళనం కన్వీనర్ కరుణాకర్ అసిరెడ్డి స్వాగతం చెప్పారు. ఆటా సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు ఆయన వాలంటీర్లకు కృతజ్ఞతలు చెప్పారు. వాలంటీర్ల వల్లనే సమ్మేళనం విజయవంతమైందని సమన్వయకర్త జగన్మోహన్ రావు అన్నారు. వాలంటీర్లకు ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా అభినందనలు తెలిపారు.

సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభినందించారు. 2014 జులై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. సమ్మేళనానికి హాజరయ్యేవారికి తాము రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని కరుణాకర్ అసిరెడ్డి చెప్పారు.

ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, ఆటా కార్యదర్శి రామ్మోహన్ కొండా, ఆటా ట్రస్టీ నరేందర్ చిమర్ల, ఆటా సలహాదారులు శేఖర్ రెడ్డి, చంద్ అక్కినేని, విఠల్ కుసుమ, అంజయ్య చౌదరి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రమోద్ సజ్జా, దేవేందర్ రెడ్డి, మురళీ రెడ్డి, శ్రీనివాస్ నిమ్మగడ్డ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వెంపటి చినసత్యం మృతికి సంతాపసూచకంగా సమావేశంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమ్మేళనం ముఖ్యవిశేషాల వీడియోను ప్రశాంత్ కొల్లిపర్ల ప్రదర్శించారు. ప్రశాంత్ అసిరెడ్డి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+