బే ఏరియాలో మహిళా సంబరాలు

కార్యక్రమానికి డాక్టర్ హనిమి రెడ్డి, జయరామ్ కోమటి, రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి ప్రసంగాలతో కార్యక్రమాలు ముందుకు సాగాయి. ఇది అత్యంత విశిష్టమైన కార్యక్రమమని, బే ఏరియాలో ఇటువంటి ప్రత్యేకమైన మహిళా కార్యక్రమం జరగడం ఇది రెండోసారి అని రవి, జయరాం అన్నారు. సమాజంలో మహిళల ప్రత్యేకత గురించి వారు వివరించారు.
ఆ తర్వాత డాక్టర్ రాం రెడ్డి మాట్లాడారు. పురుషులకు స్త్రీల అండదండలు ఎంత అవసరమో ఆయన వివరించారు. వాస్తవ ప్రపంచంలో వారి పాత్ర విశిష్టమైందని కొనియాడారు. కార్యక్రమాలు తెలుగు మహిళల ఫ్యాషన్‌తో ప్రారంభమైంది. 80 ఏళ్ల వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సు దాకా మహిళలు ఈ షోలో పాల్గొన్నారు. ముగ్గురు ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆ తర్వాత తెలుగు సంప్రదాయ ఆటలు సాగాయి. ఆ తర్వాత భారీ తెరలపై తెలుగు వీడియో గేయాలను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. శివ ఎర్రగుడి, భాను, రావు, కిశోర్, వసంత్, పద్మ, గాయత్రి, కరిష్మ, శ్రీవాణి, సుగుణ, రంజని, మల్లిక్ పూవు, మురళి, నర్సింహ, నర్సింహా గాయత్రి, లావణ్య, దుర్గ, ప్రసాద్, స్పందన, సీమ, సరళ, ఎన్ వంగ, సోమయాజులు, లక్ష్మీరావు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!