పాక్‌లో భగవద్గీతపై క్విజ్

పాకిస్థాన్ హిందూ సేవ (పిహెచ్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఇక్కడి సాంక్టా మరియా పాఠశాలలో శనివారం ఈ పోటీని నిర్వహించింది. అనంతరం పిహెచ్ఎస్ అధ్యక్షుడు సంజేష్ మాట్లాడారు. పిల్లలకు మొదట భగవద్గీతను బోధించామని, ఆ తర్వాత దాని గురించి పలు ప్రశ్నలడిగామని, దీని వల్ల వారికి మన హిందూ సంస్కృతి, పవిత్ర గ్రంథాల గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఏర్పాట్లలోనూ వారు పాలు పంచుకున్నారని తెలిపారు. ఈ విజయంతో.. మరిన్ని పోటీలు నిర్వహించాలనే ఆలోచన తమకు వచ్చిందన్నారు. పాకిస్థాన్‌లో హిందువులున్న ప్రతీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని పిహెచ్ఎస్ ప్రతినిధి సంజయ్ చెప్పారు. ఈ క్విజ్ కార్యాక్రమంలో పాఠశాలకు చెందిన పలువురు బాలురు, బాలికలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications