వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో బోనాల పండుగ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ ఎన్నారై ఫోరం (తెనా) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన లండన్‌లో బోనాల పండుగ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సంబరాల్లో దాదాపు 450 మంది తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. ఇళ్ల నుంచి బోనాలు తీసుకుని వచ్చి రామాలయంలో సంబరాలు జరిపి ఊరేగింపుగా లిఫ్టన్ స్కూల్‌కు వచ్చారు. మహంకాళి మాతరకు పూజలు నిర్వహించి తెలంగాణ గేయాల ఆలాపనతో కార్యక్రమం ప్రారంభించారు.

తెనా వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమంత కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్ జెఎసి చైర్మన్ డాక్టర్ శ్రీధర్, సామాజికవేత్త డాక్టర్ మధు అంజీకర్స తెలంగాణ పండుగ గురించి, సంస్కృతి ఆచారాల గురించి వివరించారు. తెనా వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ భైరికా, అనిల్ కూర్మాచలం సంస్థ, కార్యకర్తలకు విధి నిర్వహనలను వివరిచారు. తెనా ఉమ్మడి కార్యక్రమాలకు రోటరీ క్లబ్ హైదరాబాద్ సభ్యుడు అందెం రాంరెడ్డి మద్దతు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో ఓ గ్రామానికి నీటి సదుపాయం కల్పించే విషయంపై ఉమ్మడిగా పనిచేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి ఆయన అంగీకరించారు.

కార్యక్రమంలో చిన్న డోలు, దీక్ష, నిశ్చల నృత్యం ఆకట్టుకున్నాయి. పెద్దలకు తంబోలా, రాఫెల్, తెంలగాణ భాష, తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బోనాల పండుగ సందర్భంగా ఇంగ్లాండు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారందరికీ తెంలగాణ వంటకాలతో భోజన సదుపాయం కల్పించారు. వెంకట్ పబ్బతి వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమానికి ఎన్నారై తెరాస కార్యకర్తలు, వికాస తరంగిణి కార్యకర్తలు సహకరించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి చందూ గౌడ్, అందెం వేణు, మధు, తుకారాం, సురేష్ మంగళగిరి, వెంకట్, రాజు, విష్ణు రెడ్డి, సుధాకర్ గౌడ్, సుమ, శ్రీకాంత్, మమతా రెడ్డి, స్రవంతి ఎంతో కృషి చేశారు.

English summary
Telangana NRIs celebrated Bonalu festival in London on July 15. Telangana JAC Hyderabad chairman Sridhar, Telangana NRI Forum founder member Gampa Venugopal and others participated in the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X