వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై ఫోరం వెబ్‌సైట్ లోగో ఆవిష్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram unveils NRI Association Logo
తెలంగాణ ఎన్నారై ఫోరం వెబ్‌సైట్ లోగోను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ గురువారంనాడు ఆవిష్కరించారు. సికింద్రాబాదులోని తార్నాకాలో ఆయన లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లండన్ నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, తెనా ప్రతినిధులు కొండల్, దండ సత్యనారాయణ, విష్ణు, వెంకట నర్సింహ, శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు. వీరు లండన్ నుంచి వచ్చారు.

శ్రీనివాస్, తత్తరి జర్మనీ నుంచి వచ్చారు. తెలంగాణ జెఎసికి మద్దతుగా ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించడానికి తెనా మద్దతు తెలుపుతోందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. రాజకీయేతర ఉద్యమానికి వాళ్లు మద్దతు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సంస్థలను ఏకం చేయడానికి తాము కృషి చేస్తామని వారు చెప్పారు.

వివిధ దేశాల్లో ఉద్యోగం, చదువు, వ్యాపార రీత్యా వెళ్లినవారికి తాము అండగా ఉంటామని తెలంగాణ ఎన్నారై ఫోరం (తెనా) వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ సమాజానికి సాయం చేయడానికి సంస్థను ఏర్పాటు చేయడం పట్ల కోదండరామ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. సంస్థ లక్ష్యాలను వివరించారు.

English summary
UK based non- political /non profit/charity Telangana org, Telangana NRI forum (TeNF) is officially Launched by T JAC Chairman Sri. Prof Kodandaram garu, on May 9th 2012 Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X