లండన్‌లో ఎన్నారైల ఇఫ్తార్ విందు

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి ముస్లింలు మద్దతుగా నిలువడాన్ని ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వరకు అదే అంకిత భావం, స్ఫూర్తితో పనిచేయాలని ఆయన వారిని కోరారు.
తెలంగాణలో భిన్న మతాల ప్రజలు సామరస్యంతో, స్నేహపూర్వకంగా మసులుకుంటారని ఆయన అన్నారు. తూర్పు లండన్‌కు చెందిన అబుజార్ మొహ్మద్ రంజాన్, ఇఫ్తార్ ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్రమం ప్రార్థనతో మొదలైంది. ఆ తర్వాత ఇఫ్టార్ విందు జరిగింది. లండన్‌లో హైదరాబాద్ చెఫ్ చేసిన వంటకాలు నోరూరించాయి.
ఎన్నారై తెరాస విభాగం సభ్యులు అబుజర్ మొహ్మద్, రాజ్ కుమార్ శోనబోయిన, అశోక్ కుమార్, నాగేందర్ చిందం, హరి నవాపేట్, వెంకట్ రెడ్డి, తెలంగాణ ఎన్నారైలు రవికాంత్ పుస్పూరి, నర్సా తోటకూర, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఇందులో పాల్గ1న్నారు.












Click it and Unblock the Notifications