సాధిస్తాం: లండన్‌లో హరీష్ రావు

ఈ కార్యక్రమానికి ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ శోనబోయిన, సలహా బోర్డు సభ్యుడు పోచారం సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తన రెండేళ్లుగా తాము నిర్వహించిన కార్యక్రమాలను అనిల్ కూర్మాచలం వీడియో ప్రొమో ద్రావా చూపించి వివరించారు. తెలంగాణ రాష్ట్రం కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెరాస పార్టీని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో మనం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, దాంతోనే తెలంగాణ రాష్ట్రం సాధన లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు.
కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో తెరాస కచ్చితంగా 80 నుంచి 90 సీట్లు సాధించి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధిస్తామని రాజ్ కుమార్ శానబోయిన అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెరాస ద్వారానే సాధ్యమవుతుందని, తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని హరీష్ రావు అన్నారు.
హరీష్ రావు ప్రసంగం చేసిన తర్వాత ఎన్నారైల్లో ఒక్కొక్కరి వద్దకు వెళ్లి వారి సందేహాలను తీర్చారు. ఎన్నారై తెరాస విభాగం కోర్ సభ్యులు అశోక్ దూసరి, పోచారం సురేందర్ రెడ్డి, హరి, రాజేష్, శశి, శ్రీకాంత్, వినోద్, మహేష్, వెంకట్, శ్రావణ్, విష్ణు రెడ్డి, ప్రశాంత్,త నిక్కి రావు, మల్లా రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications