తెలుగు ఎన్నారైల వన భోజనాలు

అన్ని వయస్సులవారికి ఆటల పోటీలు జరిగాయి. ఉల్లాసభరిత వాతావరణంలో వారు పోటీల్లు పాల్గొన్నారు. వాలీబాల్, పరుగు పందాలు, ముజికల్ చైర్స్, బింగో ఆటలలో, వయోభేదం లేకుండా పిల్లలు, మహిళలు, యువతీ యువకులు, వృద్ధులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. యువతీ యువకుల, "బల ప్రదర్శన "(ఒక వైపు యువతులు, మరో వైపు యువకులు "తాడు"ను లాగటం) అందరిని అలరించింది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు.
మహిళామణులు, ఆటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘుమఘుమలాడే, తెలుగు సాంప్రదాయ విందు భోజనం వడ్డించారు. కాట్స్ నాయకులు, రాజదాని ప్రాంతంలో, తెలుగు వాళ్లకు చేస్తున్న సేవల గురించి వివరించారు. కాట్స్ నాయకులు ఆటలలో, గెలిచిన విజేతలకు "ట్రోఫి " లను అందజేశారు. దాతలకు, విచ్చేసిన అతిథులకు, ఆటలలో పాల్గొన్నవారికి, ప్రేక్షకులకు, కార్యకర్తలకు, యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియజేసారు.












Click it and Unblock the Notifications