ఆటా సదస్సుకు ఏర్పాట్లు

సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడ, సాంస్కృతిక, సెమినార్, సాహిత్య కార్యక్రమాలను అడ్ హాక్ కమిటీలు, వివిధ కమిటీల సహకారంతో అధ్యక్షుడు రాజేందర్ జిన్నా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, కార్యదర్శి రామ్మోహన్ కొండా, కోశాధికారి సత్యనారాయణ కందిమల్ల, సదస్సు కన్వీనర్ కరుణార్ ఆసిరె్డి, కన్వెన్షన్ సమన్వయకర్త జగన్మోహన్ రావు తుది రూపు ఇస్తున్నారు.
జులై 6వ తేదీన కార్యక్రమాలు ప్రారంభమైన వివిధ గ్రూపుల అవసరాలకు అనుగుణంగా మరో రెండు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. పాత మిత్రులను, కుటుంబ సభ్యులను, పరిచయస్థులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. శాస్త్రసాంకేతిక రంగాలు, సాహిత్యం, సమాజసేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డులు అందజేస్తారు. అమెరికాలో జన్మించి వివిధ రంగాల్లో సేవలు చేసినవారికే ఈ అవార్డులు పరిమితం.
సుధామయి, రాజరాజేశ్వరి, భువనకృతి, విజయలక్ష్మి, వినోద్, కుమార్ వెంపటి తమ గేయాలాపనతో ప్రేక్షకులను అలరిస్తారు. రెండో రోజు ఏడవ తేదీ కార్యక్రమం నృత్య ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. కేంద్ర మంత్రి పల్లంరాజు, రాష్టర్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, డికె అరుణ, వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులు నన్నపనేని రాజకుమారి, రోజా, ఇంద్రసేనా రెడ్డి, కిషన్ రెడ్డి తమ సందేశాలను ఇస్తారు భారతదేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురువులు, అట్లాంటా మేయర్, జార్జియా గవర్నర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఝమ్మంది నాదం పేరుతో సెమీ ఫైనల్ పోటీలు జరుగుతాయి.
వెంపటి చినసత్యంకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేస్తారు. ఎవియస్, వేణు మాధవ్, గుండు హనుమంతరావు, హేమ, శ్రీనివాస రెడ్డి వంటివారు కార్యక్రమాలు ఇస్తారు. జులై 8వ తేదీన గరికపాటి నర్సింహారావు అష్టావధానం ఉంటుంది. అల్లు అర్డున్, ఇలియానా, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ప్రేక్షకులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం గోరటి వెంకన్న జానపద గేయాలాపన ఉంటుంది. గజల్ శ్రీనివాస్ పాటలుంటాయి. సంగీత దర్శకుడు తమన్ కార్యక్రమం ఉంటుంది.












Click it and Unblock the Notifications