• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా ఆంక్షలు: కెనడా దారిలో టెక్కీలు

By Pratap
|

Canada Map
హైదరాబాద్: అమెరికా గ్రీన్‌కార్డ్, హెచ్1 వీసాలపై ఆంక్షల నేపథ్యంలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కొందరు కొత్తగా కెనడా, ఆస్ట్రేలియా దారి పడుతున్నారు. ఆ రెండు దేశాల్లో పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (పీఆర్) కోసం దరఖాస్తు చేస్తున్న ఇంజనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది నగరం నుంచి ఇప్పటికే 300 మంది ఇంజనీర్లు కెనడాకు వెళ్లినట్లు వార్తా సంస్థల కథనాలు తెలియజేస్తున్నాయి. కాగా మరో 200 మందికి కెనడియన్ పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ దక్కినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఆస్ట్రేలియాలో దేశీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ ఆ దేశానికి వెళ్లి ఉద్యోగం చేయడానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉత్సాహం చూపడం విశేషమని మీడియా కథనాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వృత్తి నైపుణ్యం ఉన్నప్పటికీ దేశీయ జీతాలపై సంతృప్తి చెందని ఈ యువ ఇంజనీర్లు ఆదాయం పెంచుకోవడానికి ఇతరత్రా మార్గాలను అన్వేషిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి వారికి ఈ మధ్యకాలంలో కెనడా ఆశను కలిగిస్తోంది. భారతీయ సంతతికి చెందిన వారికి సైతం కెనడీయన్ ప్రభుత్వం 'పీఆర్' కార్డులు జారీ చేయడానికి ఎర్రతివాచీ పర్చింది.

అమెరికా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో అక్కడి పరిశ్రమలు సమస్యలను ఎదుర్కుంటున్నాయి. మరోవైపు ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లిన భారతీయులపై ఆ దేశం పరోక్షంగా ఆంక్షలు విధిస్తోంది. గ్రీన్ కార్డుల జారీలో నిబంధనలను కఠినతరం చేసింది. హెచ్1 వీసాలను ఏడాదికి 65 వేలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యం లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ క్ర మంలోనే కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తెరపైకి వచ్చాయి. పైగా అక్కడకి వెళ్లిన మిత్రుల నుంచి వస్తున్న సమాచారం సైతం ఆసక్తికరంగా ఉండటంతో మరింత మంది ఆ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో బహుళ జాతి సంస్థలు పెట్టుబడులను పెంచుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. గత 30 రోజుల్లోనే 13వేల ఐటీ ఉద్యోగుల కోసం కెనడాలోని స్టాఫింగ్ ఏజెన్సీస్ ప్రకటనలు గుప్పించాయి. టొరంటో, మౌంట్రియల్ నగరాలు కేంద్రంగా ఈ కంపెనీలు విస్తరించి ఉన్నాయి. జీత భ త్యాలు దేశీయ ఐటీ కంపెనీలకు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉండటంతోపాటూ మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తుండటం వల్లనే నగర సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కెనడా వెళ్లడానికి ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు.

కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెం దిన పీఆర్ కార్డులు పొందడం అంత సులువేమీకాదు. చాలా ఓపిక కావాలి. మంచి ట్రాక్‌రికార్డు ఉండాలి. దరఖా స్తు చేసుకున్న 13, 16 నెలలకు గానీ అక్కడి నుంచి స్పందన ఉండదు. ఆ తర్వాత ఇతరత్రా లాంఛనాలు పూర్తి కావడానికి మరో నాలుగు నుంచి ఆరు మాసాల గడువు పడుతుంది. ఈ వి ధంగా కనీసం రెండేళ్లు పీఆర్ కార్డు కో సం ఎదురు చూడాల్సి ఉంటుందని అంటున్నారని ఓ వార్తాకథనం తెలియజేస్తోంది.

అయితే ఒక్కసారి ఈ కార్డు లభించిన తర్వాత వీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేశాలకు వెళ్లవచ్చు. ఆ స్వేచ్ఛ వీరికి ఉంటుంది. నచ్చిన కం పెనీ , జీతం లభించే వర కూ వీరు ఎ దురుచూడొచ్చు. అంతవరకూ దేశంలో ఉన్నప్పటికీ వీరిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఇది మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కలిసి వచ్చిన అవకాశంగా చెబుతున్నారు.

English summary

 Telugu software engineers are eying on Canada and Australia for better opartunity. As the USA imposed restrictions, Telugu software engineers making efforts to reach Canada and Australia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X