లండన్‌లో తెలుగు యువకుడి మృతి

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తిప్పాయిగూడెం గ్రామానికి చెందన వి. వంశీధర్ కటుంబం హైదరాబాదుకు వచ్చి బిఎన్ రెడ్డి నగర్‌లో నివాసం ఉంటోంది. వంశీధర్ ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం లండన్ వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న బంధువులు, మిత్రులు ఆదివారం బిఎన్‌రెడ్డి నగర్‌లోని ఇంటికి వచ్చారు. వంశీధర్ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు మాత్రమే కటుంబసభ్యులకు తెలిసిందని బంధువులు చెబుతున్నారు.
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన గౌతమ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించాడు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం తెనాలిలో ఉంటున్న గౌతమ్ తల్లిదండ్రులకు అక్కడి బంధువుల నుంచి శుక్రవారం అందింది.












Click it and Unblock the Notifications