వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దాడులు: అంధ్రా విద్యార్థులే ఎక్కువ

By Pratap
|
Google Oneindia TeluguNews

AP Students attacked in US
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండడ వల్లనే దాడులకు కూడా వారే ఎక్కువగా గురువుతున్నారని అంటున్నారు. అమెరికా లో 1.1 లక్షల మంది భారతదేశానికి చెందినవారున్నట్లు ఒక అంచనా. ఇందులో 45 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నట్లు అంచనా. ఆ తర్వాత స్థానం వరుసగా గుజరాత్, పంజాబ్ విద్యార్థులది. అందువల్ల భారత విద్యార్థులపై దాడులు జరిగాయనే వార్తలు వచ్చినప్పుడు తెలుగు పేరు వినిపించడం సాధారణంగా మారింది.

గత నాలుగేళ్లుగా భారత విద్యార్థులపై దాడుల సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బోస్టన్‌లో కె. శేషాద్రి రావు అనే ఎంబిఎ విద్యార్థి హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని కుటుంబం ఒడిషాలో స్థిరపడినప్పటికీ, ఆంధ్రాకు చెందిందే. ప్రతి నాలుగు కుటుంబాల నుంచి ఒకరు అమెరికాలో ఉన్నట్లు చెబుతుంటారు. అది నిజమేనని చెప్పాల్సిన పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐటి విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. చదువుల్లో టాప్‌గా వస్తున్నారు. దీంతో వారే ఎక్కువగా అమెరికాకు చదువులకు వెళ్లడం, ఐటి కంపెనీల్లో ఉద్యోగాలకు వెళ్లడం పరిపాటిగా మారిందని అభిప్రాయపడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో పది మంది విద్యార్థులు లేదా ప్రొఫెషనల్స్ అమెరికాలో కాల్పుల్లో మరణించినట్లు సమాచారం. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో కూడా ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే ఉండడాన్ని గమనించాం. అయితే, కొద్ది రోజులుగా అమెరికాలో భారత విద్యార్థులపై దాడులు తగ్గాయి. విశ్వవిద్యాలయాలకు విద్యార్థుల అవసరం ఉండడంతో ఆ దాడులు తగ్గినట్లు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు కెనడా వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Of the 1.1 lakh Indian students chasing their " US education" dream, an estimated 45% are from Andhra Pradesh followed by those from Gujarat and Punjab. No wonder then that whenever it is a case of crime against Indian students in the US, a Telugu name invariably figures among the victims. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X