సింహమే: జగన్‌పై వైయస్సార్ ఫ్యాన్స్

YS Jagan
వాషింగ్టన్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు జీవితం ఏడాదికి చేరుకున్న సందర్భంగా అమెరికాలోని వైయస్సార్ అభిమానులు ఓ ప్రకటన విడుదల చేసారు. వైయస్ జగన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ అనుసరిస్తున్న తీరును వారు ఖండించారు. జైలులో ఉన్నా సింహం సింహమేనని వారు జగన్‌ను అభివర్ణించారు. జైలుకు వెళ్లిన తర్వాత కూడా జగన్ అభిమానుల సంఖ్య తగ్గలేదని, దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో జగన్ ఒకరిగా పేరు పొందారని వారన్నారు.

రాజకీయ వేధింపుల్లో భాగంగానే జగన్‌పై కేసులు పెట్టారని, జగన్‌ను ప్రజలకు, కటుంబానికి దూరం చేయడం మానవహక్కుల ఉల్లంఘన అని వైయస్సార్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి నంద్యాల అన్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు పార్టీతో చేతులు కలిపి కొంత ప్రచారాన్ని, కొన్ని ఓట్లను పొందడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. దానివల్ల జగన్‌కు, వైయస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం చంద్రబాబుకు లభించిందని ఆయన అన్నారు. జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక చంద్రబాబు బురద చల్లుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పార్టీలోని సీనియర్ నేతలు జగన్ వైపు వస్తున్నారని ఆయన చెప్పారు.

జగన్ జైలు నుంచి బయటకు వస్తే సూపర్ హీరో అవుతాడని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భయపడుతున్నాయని, జైలు నుంచి బయటకు రాకుండా జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, ఉదయిస్తున్న సూర్యుడిని ఎవరూ ఆపలేరని జగన్ గురించి షర్మిల అన్న మాటలను వీరారెడ్డి గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ జగన్ ఉదయిస్తున్న సూర్యుడిలా వస్తాడని, నిర్దోషిగా బయటపడుతాడని ఆయన అన్నారు.

జగన్‌ను జైలులో పెట్టడానికి కారణం ఎవరనే విషయాన్ని పాఠశాలకు వెళ్లే పిల్లవాడు కూడా చెప్పగలడని, కాంగ్రెసు పార్టీని వ్యతిరేకించినందుకు జగన్‌ను జైలులో పెట్టడం విచారకరమని వేణు రెడ్డి కట్కూరి అన్నారు. పార్లమెంటులో ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ఓటేసిన వెంటనే డిఎంకె నేత స్టాలిన్ ప్రదేశాలపై దాడులు జరిగాయని, తనను వ్యతిరేకించేవాళ్లను కాంగ్రెసు సహించదనే విషయం దీనిద్వారా తెలిసిపోతోందని రాజశేఖర్ కెశిరెడ్డి అన్నారు. కాంగ్రెసు నియంతృత్వానికి లొంగి ఉంటే జగన్‌ను జైలుకు పంపించేవారు కాదని ఆయన అన్నారు.

చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తనపై సిబిఐ విచారణ జరగకుండా ఉండడానికి కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని రాజశేఖర్ సన్నపు, సందీప్ కొండకింది అన్నారు. సిబిఐ పనితీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీసులపై, సిబిఐపై విశ్వాసం పోయిందని రాజా చౌడవరం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+