అమెరికా ఇండియా పరేడ్‌లో అన్నా

హజారే అమెరికా పర్యటనలో భాగంగా లాస్ ఏంజెల్స్ ను సందర్శించి అక్కడి ప్రవాస భారతీయులను కలిశారు. పీపుల్స్ ఫర్ లోక్ సత్తా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అన్నా హజారే హాజరైన ఈ కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
ఆయన చేపట్టిన అవినీతి వ్యతిరేక పోరాటానికి తాము కూడా మద్దతు పలికామని పీపుల్స్ ఫర్ లోక్ సత్తా సభ్యులు అన్నా హజారేకు తెలిపారు. ప్రవాస భారతీయ సంఘాల సభ్యులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులు, 240 మైళ్ల దండి మార్చ్-2, అవినీతి అంతం, మాక్ జైల్ భరో, సేవ్ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) మొదలైన కార్యక్రమాలను ప్రదర్శించారు.
అనంతరం హజారే ప్రవాస భారతీయులను ఉద్దేశించి సుమారు 40నిమిషాలపాటు ప్రసంగించారు. ఎన్నికల సంస్కరణలు, సమాచార హక్కు చట్టం కిందకు రాజకీయ పార్టీలను తీసుకురావడంపై ఆయన మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా అక్టోబర్ 2న రాంలీల మైదానంలో తాను చేపట్టబోయే ఆందోళనపై ఆయన ప్రసంగించారు. ప్రవాస భారతీయ భారతీయులు చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications