గర్ల్ ఇష్యూ: భారత సంతతి విద్యార్థి హత్య

Murder
దర్బన్: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి దక్షిణాఫ్రికాలో హత్య గురయ్యాడు. దుండగులు అతన్ని కత్తులతో పొడిచి చంపారు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓ అమ్మాయి వ్యవహారంలో దుండుగులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

దుండగులు దర్శన్ మూడ్లీ (16), అతని సోదరుడు రేవర్సీన్ (18)లను కొట్టారు. కత్తులతో పొడిచారు. ఈ దాడిలో దర్శన్ మూడ్లీ మరణించాడు. అతన్ని ఛాట్స్‌వర్త్ వీధిలో పడేసిపోయారు. తీవ్రంగా గాయపడిన రేవర్సీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దర్శన్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. పాఠశాలలో ఇంతకు ముందు దర్శన్‌పై దాడి జరిగింది. దాని నుంచి అతను బయటపడ్డాడు. తన సోదరితో మాట్లాడినందుకు దర్శన్‌తో పాఠశాలలో ఒకతను గొడవ పడ్డాడని, దాంతో సమస్య ప్రారంభమైందని దర్శన్ తండ్రి జాయ్‌స్ మూడ్లీ చెప్పారు.

పాఠశాలకు ఓ విద్యార్థి కత్తిని ఎలా తీసుకొచ్చాడనే విషయంపై, అందుకు దారి తీసిన పరిస్థితులపై పాఠశాల అధికార వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. తొలి సంఘటనపై ఫిర్యాదు చేయడానికి తాను పాఠశాలకు వచ్చినట్లు సీనియర్ మూడ్లి చెప్పారు.

మూడ్లీ సోదరులపై దాడికి దిగిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు, మరొకతను పరారీలో ఉన్నట్లు ద డైలీ న్యూస్ వార్తాకథనం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+