మాల్దీవుల్లో ఇండియన్ టీచర్ మృతి

విధులకు రాకపోవడంతో, ఫోన్ కాల్స్ చేస్తే సమాధానం రాకపోవడంతో పాఠశాలకు చెందిన సిబ్బంది ఇంటికి వెళ్లారని, ఈ సమయంలో సతీష్ కుమార్ శవం కనిపించిందని రిజా చెప్పారు. దీవిలో పాఠశాలలో అతను కంప్యూటింగ్ నేర్పిస్తాడని, మోతాదుకు మించి మందులు తీసుకోవడంతో అతని గత వారం ఆస్పత్రిలో కూడా చేర్చినట్లు రిజా చెప్పారు. సన్ డైలీతో రిజా ఆయన విషయం చెప్పారు.
అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని, చాలా పుకార్లు వినిపిస్తున్నాయని, వాటి గురించి మాట్లాడదలుచుకోలేదని, అవి వాస్తవాలు కాకపోవచ్చునని రిజా అన్నారు గత మూడేన్నరేళ్లుగా సతీష్ కుమార్ పాఠశాలలో పనిచేస్తున్నాడు.
దీవిలోని ఓ అమ్మాయితో అతనికి గల సంబంధమే ఆత్మహత్యకు కారణమనే ఊహాగానాలు చెలరేగుతున్నట్లు సన్ డైలీ రాసింది.












Click it and Unblock the Notifications