తానా సభలకు యేసుదాసు: తోటకూర
డల్లాస్: ఈ ఏడాది మే 24 - 26 తేదీల మధ్య జరిగే తానా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా 300 మంది వాలంటీర్లతో సన్నాహక సమావేశం జరిగింది. పద్మభూషణ్ డాక్టర్ కెజె యేసుదాసు తానా మహాసభల్లో ప్రదర్శన ఇవ్వనున్నారని, ఇప్పటి వరకు ఏ తెలుగుసభలకు కూడా యేసుదాసు హాజరు కాలేదని, తొలిసారి తమ సభల్లో ప్రదర్శన ఇవ్వడానికి అంగీకరించారని తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర చెప్పారు.
ఈ వారం లక్కీ డ్రాలో ప్లానో టెక్సాస్‌కు చెందిన రాధ, మురళీి చింతమన్ గెలుచుకున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి కోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తీసిన లక్కీ డ్రాలో వారు గెలిచారు.

మహాసభల ఏర్పాట్లను చూడడానికి వారాంతంలో ఫన్ ఏసియాలో 300 మందికి పైగా వాలంటీర్లు సమావేశమయ్యారు. మహాసభల సమన్వయకర్త మురళీ వెన్నం వివిధ కమిటీలకు నేతృత్వం వహిస్తున్న 30 మందిని పరిచయం చేశారు.
తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, మహాసభల సమన్వయకర్త మురళీ వెన్నం, తానా కార్యదర్శి రామ్ యలమంచిలి, తానా ఎస్‌డబ్ల్యుఆర్ఆర్ మంజు కన్నెగంటి, తానా మహాసభల కార్యదర్శి చలపతిరావు కొండ్రకుంట, మహాసభ కోశాధికారి డాక్ట్రర్ సిఆర్ రావు, తానా కన్వెన్షన్ చైర్ డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి, కన్వెన్షన్ అడ్వయిజరీ కమిటి చైర్ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, టాంటెక్స్ అధ్యక్షుడు సురేష్ మండువ మాట్లాడారు.












Click it and Unblock the Notifications