వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో రసరాజు కవితాగోష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

టెక్సాస్: డల్లాస్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ కళావాహిని ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ప్లేనోలోని బావర్చీ రెస్టారెంట్ లో ప్రముఖ కవి, రచయిత రసరాజు కవితా గోష్ఠి సాహితీప్రియుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముందుగా కళావాహిని వ్యవస్థాపకులలో ఒకరైన మల్లవరపు అనంత్ సభకు స్వాగతవచనాలు పలికారు. మరో వ్యవస్థాపకుడు జువ్వాడి రమణ ముఖ్య అతిథి రసరాజును సభకు పరిచయం చేసి వేదిక మీదకు ఆహ్వానించారు. రసరాజు గారిని స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం) సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద పుష్పగుఛ్ఛంతో సత్కరించారు.

Kala Vedika Program organized in Dallas

రసరాజు తాను ప్రథమంగా పద్యకవిగా తన కవితాయాత్ర ప్రారంభించానని చెప్తూ తెలుగుభాష ఔన్నత్యం వివరించి అందులో విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, తిరుపతి వేంకటకవుల పద్యాలను సోదాహరణంగా వివరించి తాను రాసిన కొన్ని పద్యాలను చదివి వినిపించారు. కవిగా తనకు ప్రక్రియ గురించి పట్టింపు లేదని తాను రాసిన మినీ కవిత, నానీ, గజల్, సినీ గేయాలు పాడి వినిపించారు. కళావాచస్పతి కొంగర జగ్గయ్య తన కవిత్వాన్ని విశేషంగా అభిమానించేవారని ఆయన ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు తనను పరిచయం చేశారని చెప్పారు.

అసెంబ్ల్రీరౌడీ సినిమాలోని ‘అందమైన వెన్నెలలోన' పాటకు అవార్డులు వచ్చిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రేక్షకుల కోరిక మీద గజల్ ప్రక్రియ రచనలో వున్న కష్టనష్టాలు వివరించారు. ఎంతో కవిత్వవంతంగా వున్న ఆయన రచనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఎన్నో సార్లు చప్పట్లతో సభ మోగి పోయింది.

స్థానిక గాయకులు సాధు జ్యోతి, నారని రమేశ్, రసరాజు రాసిన అందమైన వెన్నెలలోన (అసెంబ్లీ రౌడీ) పాడి వినిపించారు. ఆ పూలరంగు నీ చీర చెంగు (దొంగ పోలీస్), అలాగే ఇటీవల డల్లాస్‌లో రసరాజు వ్రాసిన కొత్తపాట కోపమైన అందమే సాధు జ్యోతి పాడి ప్రశంసలందుకున్నారు. సభికుల కోరిక మీద ఆనాటి మధురగీతం నన్నుదోచుకుందువటే సాధు జ్యోతి, మద్దుకూరి చంద్రహాస్ పాడి వినిపించారు.

కళావాహిని కార్యవర్గం మల్లవరపు అనంత్, జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, నసీమ్ షేక్, కాజా సురేశ్ రసరాజుగారిని దుశ్శాలువతో సత్కరించారు. టాంటెక్స్ (ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం) తరపున అధ్యక్షుడు మండువ సురేశ్, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ముఖ్యఅతిథిని సత్కరించారు.
ఈ కవనపు విందు, వీనుల విందు తో పాటు చక్కని విందు తో కార్యక్రమం సుసంపన్న గా జరిగి, వచ్చిన వారికి మంచి అనుభూతినిచ్చింది.

English summary

 Kalavahini has organized Rasaraju's poetry recitation programme in Dallas of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X