లండన్‌లో బోనాల సందడి
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ రామంచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలంగాణ ప్రకాష్, తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్ఫాకులు గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచలం, మహిళా సమన్వయకర్త పవిత్రా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని రామచందర్ రావు చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ కుట్రపూరితమైన వ్యూహాలను అనుసరిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని తెలంగాణ ప్రకాష్ అన్నారు. జయశంకర్ కలలను సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రసమయి బాలకిషన్ తన ఆటపాటలతో అలరించారు. తెలంగాణ పండుగ విశిష్టతను, సంస్కృతిని తెలుపుతూ లండన్‌లో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. తాము తెలంగాణ సంస్కృతీ పరిరక్షణకు, తెలంగాణకు సంబంధించిన వివిధ రంగాల్లో తాము చేస్తున్న కృషిని గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచలం వివరించారు.
వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి జయశంకర్ అవార్డును, స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందించారు. ప్రమోద అంతరి వందన సమర్పణ చేశారు. నాగరాజు, రంగుల సుధాకర్ అధ్యక్షత వహించారు. అశోక్ పెద్దిరాజు, చిబర్తి శశిధర్, రావు, సంతోష్, ప్రసాద్, శివాజీ షిండే, మంద సునీల్, చిత్తరంజన్, చందు, మల్లారెడ్డి, తిరుపతి, గణేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications