పేద విద్యార్థికి ఎన్నారైల సహాయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం ఓ పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసింది. ఎం సురేశ్ అనే విద్యార్థికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతుల మీదుగా ఆ ఆర్థిక సాయాన్ని అందజేశారు. సురేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా. లక్ష్యం సివిల్ సర్వీసు సాధించడం.

కానీ అతని ఆర్థిక స్థోమత అందుకు అడ్డం పడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో లండన్‌కు చెందిన తెరాస ఎన్నారై సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను ఈ-మెయిల్ ద్వారా అతను సంప్రదించాడు. దీంతో స్పందించింది. సాయానికి ముందుకు వచ్చింది.

జన్మదిన వేడులకు దూరంగా ఉండాలని తెరాస పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు నిర్ణయించుకున్నారు. దీంతో ఆ వేడుకలకు అయ్యే ఖర్చు మొత్తం రూ. 25 వేలను సురేష్‌కు సాయంగా అందివ్వాలని నిర్ణయించింది.

NRI extends financial help to a poor student

ఈ మేరకు ఇటీవల కెసిఆర్ చేతుల మీదుగా విద్యార్థి సురేశ్ రూ.25 వేల చెక్కును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ఎన్నారై సెల్ తెలంగాణ కో-ఆర్డినేటర్ జి. రఘురాం పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+