బహ్రెయిన్‌లో తెలంగాణ సమావేశం

తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అభివృద్ధికి తమ వంత సాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు. బహ్రెయిన్ ఎన్నారైలను ఉద్దేశించి తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్, అనిల్ కూర్మాచలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలని వారు సూచించారు.
ముందుగా కొవ్వొత్తులు వెలిగించి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన యువకుల ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. బలిదానాలు అపి ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సాధన దిశగా పనిచేయాలని వారు తెలంగాణ యువకులను కోరారు.
సడక్ బంద్ సందర్భంగా కోదండరామ్ తదితరులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె రాజు, పి. శ్రీధర్, పి. ఏడుకొండలు, ఎస్ విజయ్ కాంత్, కె. మజీద్, సి ప్రవీణ్, పి. చేరాలు, యాదగిరి, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications