ఒయు విద్యార్థికి రజత పతకం

లండన్: ఈ నెల 23వ తేదీన లండన్‌లో జరిగిన ఇంగ్లాండు ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థికి రజత పతకం దక్కింది. ఈ పోటీల్లో భారతదేశం తరఫున మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి కరాటే రాజు పాల్గొన్నాడు. అతను రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.

దేశం కోసం రజత పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని కరాటే రాజు అన్నాడు. ప్రోత్సాహం లభిస్తే అనేక పతకాలు సాధించగలనని అన్నాడు.

కాగా, తైక్వాండ్ పోటీల్లో రజత పతకం సాధించిన కరాటే రాజుకు లండన్‌లోని తెలంగాణ సంఘాలు సన్మానం చేశాయి. తెలంగాణ ఎన్నారై సంఘం, టిఆర్ఎస్ ఎన్నారై విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కరాటే రాజుకు ఘనంగా సత్కారం జరిగింది.

రాజు శానబోయిన అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో తిరుపతి, నగేశ్ రెడ్డి, వంసీ, హరిగౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గంప వేణుగోపాల్, ఉదయ్, నాగరాజు, అశోక్ కుమార్ ఈ సందర్భంగా ప్రసంగాలు చేశారు. కేంద్ర, ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు.

ఒయు విద్యార్థికి రజత పతకం

ఇంగ్లాండు అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో రజత పతకం పొందిన కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

ఇంగ్లాండు అంతర్జాతీయ తైక్వాండ్ పోటీల్లో రజత పతకం స్వీకరించిన కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

తెలంగాణ ఎన్నారైల సన్మాన కార్యక్రమంలో కరాటే రాజు

ఒయు విద్యార్థికి రజత పతకం

తెలంగాణ ఎన్నారైల సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కరాటే రాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+