యుకెలో ప్రశాంత్ భూషన్ ప్రసంగం

జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించని నేపథ్యంలో భారతదేశంలోని అవినీతిపై ప్రజా పోరాటంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. యుకె, అమెరికా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ తదితర దేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పలువురు ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ యుకె మద్దతుదారుల గ్రూప్ జనవరి 26వ తేదీన ఏర్పడింది. మహాత్మా గాంధీ ఆశయాల మేరకు స్వరాజ్ సాధనకు యుకె గ్రూప్ తన వంతు కృషి చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ యుకె మద్దతుదారుల వాలంటీర్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు న్యాయవాది. ఆయన ఇప్పటి వరకు 500కు పైగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై (పిల్స్‌పై) వాదించారు. సుప్రీంకోర్టులో 1983 నుంచి కేసులు వాదిస్తున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన ప్రశాంత్ భూషణ్ భారతదేశంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications