వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా సభలు: సాహిత్యానికి పెద్ద పీట

By Pratap
|
Google Oneindia TeluguNews

TANA Convention in Dallas to unite Telugu Literary Stalwarts
డాల్లస్: 1977 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగు వారి భాష, సాంస్కృతిక, అత్యవసర అవసరాలను తీర్చడానికి స్థాపించబడి గత మూడున్నర దశాబ్దాలకు పైగా అత్యుత్తమ సేవలందిస్తున్న జాతీయ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి 19వ మహాసభలు 2013, మే నెల 24 నుండి 26వ తేదీ వరకు టెక్సస్ లోని డాల్లస్ మహానగరంలో జరుగ నున్నాయి. 1986 లో భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం స్థాపించబడిన స్థానిక తెలుగు సంస్థ "ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం" (టాంటెక్స్) ఈ మహాసభలకు సహ ఆతిధ్యం అందిస్తున్న విషయం మీకు తెలిసిందే.

తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, 19వ మహాసభల సమన్వయకర్త మురళి వెన్నం, మహాసభల కార్యదర్శి చలపతి కొండ్రకుంట వివిధ శాఖలలో ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుండి దాదాపు పదివేలకు పైచిలుకు తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. భారీ ఎత్తున జరుగనున్న తానా మహాసభల్లో సాహిత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

తానా మహాసభల సాహిత్య వేదిక సమన్వయకర్త విజయ చంద్రహాస్ మద్దుకూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ - "తెలుగువారికే ప్రత్యేకమైన అవధాన ప్రక్రియ గురించిన ప్రత్యేక కార్యక్రమం ‘అవధాన కళావైభవం'లో అవధాన దిగ్గజాలు మేడసాని మోహన్, గరికిపాటి నరసింహారావు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మొదలైన వారు అవధాన కళ లోని అనేక పార్శ్వాలను సోదాహరణంగా వివరించనున్నారు. మామూలుగా జరిగే అవధానంలా కాకుండా కొత్తగా విశ్లేషణాత్మకంగా అనేకమంది అవధానులతో జరిగే ఈ ముఖాముఖీ అందరికీ అలరించబోతోంది" అని అన్నారు.

రిజిష్ట్రేషన్ ప్రారంభం

మహాసభల నూతన వెబ్ సైట్ www.tana2013.org ను ఇటీవల ఆవిష్కరించారు. ఇంటర్నెట్ ద్వారా 19వ మహాసభలకు రిజిష్ట్రేషన్ సదుపాయం ఈ రోజే ప్రారంభించారు. పైన పొందుపరచిన వెబ్ సైట్ లో "రిజిష్ట్రేషన్" మీద నొక్కి మీ కుటుంబ సభ్యల వివరాలతో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. మహాసభలకు సంబందించిన అన్నీ వివరాలను ఎప్పటికప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉన్న పదహారు కోట్ల తెలుగు వాళ్లకు తెలియజేయడం ఈ వెబ్ సైట్ ప్రధానోద్దేశ్యం. చీరలమ్మా చీరలు ....ఊప్పాడొప్పాడా చీరలు! అవునండీ.. ఈ మహాసభలకు తమ పేరు నమోదు చేసుకొన్న వారి జాబితా నుండి ప్రతివారం ఒక లక్కీ డిప్ విజేతకు రెండు వందల డాలర్ల విలువ చేసే ఉప్పాడ చేర బహుమతిగా ఇవ్వడానికి కంకటాల సంస్థ వారు ముందుకు వచ్చారు.

ధ్రువతారల తెలుగు వెలుగుల జిలుగు

తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "ప్రవాసంలో తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణకు పెద్ద పీట వేసి గత మూడున్నర దశాబ్దాల కాలంపాటు తానా సంస్థ నిరాటంకంగా చేస్తున్న కృషి మీకు తెలిసిందే. చలన చిత్రాలకు రసవత్తరంగా సాహిత్యాన్ని అందిస్తున్న రచయితలకు ఈ మహాసభలలో ఒక ప్రత్యెక వేదిక ఏర్పాటు చేయబడింది. చలనచిత్ర రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, చంద్రబోస్, వడ్డేపల్లి కృష్ణ, రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరాం మరొక వైవిధ్యభరితమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీనులవిందుగా ప్రముఖగాయకుల పాటలు, అవి వ్రాసిన రచయితల మాటలు, సభికుల ప్రశ్నలకు సమాధానాలు వీటన్నింటితో చలనచిత్ర గీత సాహిత్యం మీద జరుగబోయే ఈ కార్యక్రమం తానా సభలలో వన్నెల హరివిల్లు వెలయిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు" అని అన్నారు.

అందరినీ ఆకర్షించే విభిన్న కార్యక్రమాలు

తెలుగు భాషాసాహిత్యాలకు పట్టాభిషేకం చేయనున్న ఈ మహాసభలలో ఇతర సాహిత్య ప్రక్రియల మీద జరుగబోయే కార్యక్రమాల వివరాలు త్వరలో తెలియజేస్తామనీ, వినూత్నరీతులలో వినోద ప్రధానంగా సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేవిధంగా కార్యక్రమాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నామనీ తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, 19వ తానా మహాసభల సమన్వయకర్త మురళి వెన్నం, మహాసభల కార్యదర్శి శ్రీ చలపతి కొండ్రగుంట, సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త శ్రీ విజయచంద్రహాస్ మద్దుకూరి ఒక తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేసారు.

English summary
The Literary Committee is gearing up with full speed to deliver unprecedented programs to showcase the glory of the Telugu language and the literary richness at the 19th TANA convention scheduled from May 24th to 26th at the Dallas Convention Center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X