వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా బ్యాక్ ప్యాక్ ప్రోగ్రామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

డల్లాస్: గత అనేక సంవత్సరాలుగా యేటా అమెరికాలోని పలు చోట్ల స్కూళ్ళు తెరిచే ముందు తానా సంస్థ "బ్యాక్ ప్యాక్ ప్రోగ్రాం" నిర్వహిస్తోంది. మన మాతృభూమి భారత దేశం అయినా మనని, మన ప్రతిభని గుర్తించి ఆదరించిన అమెరికా సమాజంతో మమేకమై ఇక్కడ మనతో పాటు నివస్తూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి ఎంతో కొంత సాయపడాలనే తలంపుతో కొన్ని సంవత్సరాల క్రితం డా. గొర్రెపాటి నవనీత కృష్ణ తానా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అప్పటినించి అది నిరాటంకంగా కొనసాగుతోంది.

2013 సంవత్సరంలో కూడా నూతన తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్ నేతృత్వంలో అమెరికాలోని అనేక నగరాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఆగష్టు నెలలో స్థానిక తెలుగు సంస్థ టాంటెక్ష్ సహాయంతో డల్లాస్ తానా టీం నగరం లోని వివిధ స్కూళ్ళలో బ్యాక్ ప్యాక్ ప్రోగ్రాం నిర్వహించింది. హోప్ మేడ్రానో ఎలిమెంటరీ స్కూల్, కాలనీ హైస్కూల్, హెచ్ఇబి స్కూల్ డిస్ట్రిక్ట్ కి చెందిన వివిధ స్కూల్స్ కు 400 పైగా స్కూల్ బాగ్స్ పంపిణీ చేసింది.

TANA organized backpack programs

కొన్ని విడతలుగా ఆగష్టు నెలలోని పలు తేదీలలో, పలు స్కూళ్ళలో జరిగిన ఈ కార్యక్రమం ఆగష్టు 31వ తేదీన హోప్ మేడ్రానో ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన సమావేశంతో ముగిసింది. ఆ రోజు 150కి పైగా చిన్నారులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తానా, టాంటెక్ష్ వారు అందించిన స్కూల్ బాగ్స్ తో పాటు స్కూల్ కి అవసరమైన ఇతర సామాగ్రి కూడా పొందారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తానా ప్రాంతీయ ప్రతినిధి డా. అడుసుమిల్లి రాజేష్ - అడిగిందే తడవుగా విరాళాలు అందించిన దాతలకు, తమ సమయాన్ని వెచ్చించిన తానా మరియు టాంటెక్ష్ సభ్యులకు, ఇతర తెలుగు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. టాంటెక్ష్ అధ్యక్షులు మండువ సురేష్ బ్యాక్ ప్యాక్ కార్యక్రమం గురించి చక్కగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు మాట్లాడుతూ మనం ఉంటున్న సమాజంతో మమేకమై చేదోడు వాదోడుగా ఉండవలసిన ఆవశ్యకతని వివరించారు. కార్యక్రమ రూపకర్త డా. గొర్రెపాటి నవనీత కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

తానా సభ్యులు వెన్నం మురళి, పోలవరపు శ్రీకాంత్, దొడ్డ సాంబ, పావులూరి వేణు, రవి ఆలూరి టాంటెక్ష్ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బు, సింగిరెడ్డి శారద, ములుకుట్ల వెంకట్ తదితరులు కార్యక్రమానికి హాజరై సహకారమందించారు. ముఖ్యఅతిధి గా హాజరైన డల్లాస్ సిటీ కౌన్సిల్ మెంబెర్ ఆడం మేడ్రానో మాట్లాడుతూ - ఇటువంటి చక్కని ఆలోచనతో, ఆర్ధిక పరమైన అవసరాలు ఉన్న కుటుంబాలలోని చిన్నారులకి సాయం అందించడానికి ముందుకు వచ్చిన తానా, టాంటెక్ష్ సంస్థలకు, తెలుగు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

English summary
Every year before the schools re-open in USA, Telugu Association of North America (TANA) conducts backpack donation programs in various cities across the country. This program has been initiated by TANA several years ago to give back to the community where we live in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X