ఎన్నారై ఫ్యామిలీ హత్యలో దోషులు

4 convicted in NRI family murder
హైదరాబాద్: 2009లో ఎన్నారై కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టు నలుగురిని దోషులుగా తేల్చింది. ఈ మేరకు కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 40 ఏళ్ల ఇంజనీర్ కె. ప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, వారి పిల్లలు కేతన్ (15), కవిత (10)లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని రాక్ రాయల్ లాడ్జిలో హత్య చేశారు. ఆర్థిక కారణాలతో ఈ హత్యలు చేశారు.

కేసులో ప్రధాని నిందితుడు మృతుల కుటుంబానికి బంధువు. మాధవి, ఆమె భర్త జాన్ అబ్రహం, మరో ఇద్దరు కిరణ్ రాథోడ్, ప్రదీప్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షులను విచారించిన ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారందరినీ దోషులుగా తేల్చారు.

మాధవి, జాన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించగా, కిరణ్, ప్రదీప్‌లు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. విజయలక్ష్మి బంధువు అయిన మాధవి ప్రసాద్ నుంచి 18 లక్షల రూపాయల తీసుకుంది. ఆయిల్ కంపెనీలో ఇంజనీర్ అయిన ప్రసాద్ తన భార్య విజయలక్ష్మి, పిల్లలతో దుబాయ్‌లో ఉండేవారు. డబ్బులు తిరిగి ఇస్తానని ఇచ్చిన హామీని మాధవి నిలబెట్టుకోలేకపోయింది.

డబ్బు కోసం ప్రసాద్ ఒత్తిడి తేవడంతో మాధవి వారి హత్యకు కుట్ర చేసింది. ఇందుకు తన భర్త జాన్, కిరణఅ, ప్రదీప్ సహాయం కోరింది. కిరణ్, ప్రదీప్ ఇంజనీరింగ్ విద్యార్థులు. 2009 ఆగస్టులో భారత్‌కు వచ్చిన ప్రసాద్ కుటుంబ సభ్యులు దుబాయ్‌కి వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో లాడ్జిలో దిగారు. ఆ సమయంలో మాధవి వారి హత్యకు పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+