వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

టెక్సాస్: డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద 69వ స్వాతంత్ర్య వేడుకలను ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 600మందికి పైగా పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్మారక స్థలి కార్యవర్గ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర స్వాగతోపన్యాసం చేశారు.

భారతీయులు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సంగీతం, కళలు, క్రీడల్లో కూడా దూసుకుపోతున్నారని తెలిపారు. భారతీయులు అమెరికా జీవన స్రవంతిలో మమేకమై ఇరుదేశాల మధ్య స్నేహ బంధాన్ని పటిష్టం చేయాలని అన్నారు.

అనంతరం కార్యదర్శి రావు కల్వల, కార్యవర్గ సభ్యులు తయ్యూబ్ ఖుండ్ వాలాలు మాట్లాడారు. భారతదేశం మహాత్ముని ఆదర్శాలను పుణికిపుచ్చుకుందని అన్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఎగురవేసి మహాత్ముని స్మరించుకున్నారు. వేడుకలకు హాజరైన ప్రవాసులు గాంధీ విగ్రహం వద్ద పువ్వులు వేసి నివాళులర్పించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అక్టోబర్ 3న జరిగే పీస్ వాక్‌లో పాల్గొనాలని తయ్యూబ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్మారకస్థలి కార్యవర్గ బృందం డాక్టర్ శ్రీనివాస్ గునుకుల, పియూష్ పటేల్, మురళీ వెన్నం, సునీల్ మైనీ, జాక్ గోద్వానీ, అక్షయ్ వాణి, ఎంవిఎల్ ప్రసాద్, సిసి థియోఫిన్, పాల్ పాండ్యన్, షబ్నమ్ మోడ్గిల్, నాగేష్, వెంకట, లోకేష్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద 69వ స్వాతంత్ర్య వేడుకలను ప్రవాసులు ఘనంగా నిర్వహించారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

ఈ కార్యక్రమంలో 600మందికి పైగా పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్మారక స్థలి కార్యవర్గ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర స్వాగతోపన్యాసం చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

భారతీయులు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సంగీతం, కళలు, క్రీడల్లో కూడా దూసుకుపోతున్నారని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

భారతీయులు అమెరికా జీవన స్రవంతిలో మమేకమై ఇరుదేశాల మధ్య స్నేహ బంధాన్ని పటిష్టం చేయాలని అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

అనంతరం కార్యదర్శి రావు కల్వల, కార్యవర్గ సభ్యులు తయ్యూబ్ ఖుండ్ వాలాలు మాట్లాడారు. భారతదేశం మహాత్ముని ఆదర్శాలను పుణికిపుచ్చుకుందని అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాలు

స్వాతంత్ర్య దినోత్సవాలు

భారత త్రివర్ణ పతాకాన్ని ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఎగురవేసి మహాత్ముని స్మరించుకున్నారు. వేడుకలకు హాజరైన ప్రవాసులు గాంధీ విగ్రహం వద్ద పువ్వులు వేసి నివాళులర్పించారు.

English summary
Mahatma Gandhi Memorial of North Texas (MGMNT) hosted India’s 69thIndependence Day at Mahatma Gandhi Memorial Plaza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X