అల్లుడిని హత్య చేసిన 77 ఏళ్ల ఆంధ్ర వ్యక్తికి మానసిక వ్యాధి

77-year-old Andhra Pradesh murder accused bipolar, let off in United States
న్యూఢిల్లీ: అల్లుడిని అమెరికాలోని నెబ్రాస్కాలో కత్తితో పొడిచి చంపిన కేసులో నిందితుడైన 77 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తి బైపోలార్ డిజార్డర్‌ (మానసిక వ్యాధి)తో బాధపడుతున్నాడు. దాంతో చికిత్స నిమిత్తం అతన్ని కోర్టు ఆస్పత్రికి పంపించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన బాయప లింగాల సెకండ్ డిర్గీ హత్య కేసులో నిందితుడు. అతను బైపోలార్ డిజార్జర్‌తో బాధపడుతున్నాడు. మిలియన్ డాలర్లతో అతనికి బెయిల్ లభించింది. అతని ఇండియన్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దోషిగా తేలితే లింగాలకు 70 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

లింగాలకు పరీక్షలు, చికిత్స లింకన్ ప్రాంతీయ కేంద్రంలో జరుగుతాయి. మృతుడు సుజయ్ నూక ఓ ఇంజనీర్. లింకన్ ఇండస్ట్రీస్‌లో సప్లయ్ చైన్ మేనేజర్‌గా పనిచేస్తుండేవాడు. సుజయ్‌కు తండ్రి, భార్య ఉమ, సోదరులు విజయ్, హరి ఉన్నారు. ముగ్గురు పిల్లలు అవానీ (12), ఆకాష్ (9), అర్ణవ్ (5) ఉన్నారు.

లింకన్ పోలీసులు వెబ్‌సైట్‌లో ఉంచిన నివేదిక ప్రకారం - 2014 ఆగస్టు 5వ తేదీన సుజయ్ హత్యకు గురయ్యాడు. ఛాతీపై కత్తిపోట్లతో అతను పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు. హత్యకు ఉపయోగించిన కత్తి సంఘటనా స్థలంలో దొరికింది.

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న తన తండ్రి లింగాల తన భర్త సుజయ్‌ని 8 అంగుళాల కత్తితో పొడిచినట్లు సుజయ్ భార్య డాక్టర్ నూక ఉమ చెప్పారు. తండ్రికి ఆమె చికిత్స చేస్తూ వచ్చినట్లు లాంకస్టర్ కౌంటీ కోర్టు తెలిపింది. లింగాల ఇండియాకు తిరిగి వెళ్తానని అంటే తాను వ్యతిరేకించానని ఆమె చెప్పారు. లింగాల తన కుమారుడిని కత్తి పొడవడం తాను చూసినట్లు సుజయ్ తండ్రి లక్ష్మీ నూక చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+