NRI News: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన హైదరాబాద్ విద్యార్థి..
అమెరికాలో భారతీయులు తరుచూ రోడ్డు ప్రమాద బారిన పడుతున్నారు తాజాగా హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదిత్య అనే భారతీయ విద్యార్థి కారు ఢీకొనడంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. శనివారం తెల్లవారుజామున నార్త్ ఫిలడెల్ఫియాలోని వాట్స్ స్ట్రీట్ 900 బ్లాక్‌లో ఆదిత్య రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఓ తెల్లటి కారు ఆదిత్యను ఢీ కొట్టిందని స్థానిక మీడియా పేర్కొంది. ఆదిత్య తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. మెదడు రక్త గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆదిత్య ప్రస్తుతం USలోని ఫిలడెల్ఫియాలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన టెంపుల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతన్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఆదిత్య వైద్య ఖర్చులు
ఎక్కువ అయ్యాయి.

ఇప్పటికే USD 250,000 మించిపోయాయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి, అమెజాన్ లో జాబ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న ఆదిత్యకు వైద్య ఖర్చులను భరించడం సవాలుగా మారింది. అతని కుటుంబం ఈ అధిక ఖర్చులను భరించలేకపోతోంది. దీంతో అతనికి సహాయం చేయాలని కోరుతున్నారు. ఆదిత్య చికిత్సకు మద్దతుగా అతని స్నేహితుడు శశిధర్ దుంప GoFundMe ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ
అప్పీల్ కమ్యూనిటీ ఆదిత్య ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చింది. ఇప్పటివరకు USD 119,732 సేకరించారు. అయితే మొత్తం ఖర్చుల కోసం మరితం డబ్బులు అవసరమని చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ఫిలడెల్ఫియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదిత్య, అతని కుటుంబానికి న్యాయం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications