Canada: కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి చెందిన గుర్విందర్ నాథ్..
కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థి గుర్విందర్ నాథ్ పై దుండగులు దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన జులై 9 తెల్లవారుజామున బ్రిటానియా, క్రెడిట్‌వ్యూ రోడ్‌ల వద్ద పిజ్జా డెలివరీ చేయడానికి నాథ్ బయటకు వెళ్లినప్పుడు జరిగింది. గుర్తుతెలియని దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. దుండగుల దాడిలో గుర్విందర్ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. గుర్విందర్ నాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ జులై 14 మృత చెందాడు.
దీన్ని టొరంటోలోని ఇండియా కాన్సులేట్ ధృవికరించింది." గుర్విందర్ నాథ్ మరణం బాధకరమని.. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నామని" ఇండియా కాన్సులేట్ తెలిపింది. హృదయ విదారక ఘటనకు ప్రతిస్పందనగా ఆన్‌లైన్‌లో చాలా మంది భారతీయులు స్పందించారు. ఈ సమయంలో భారతీయులు ప్రదర్శించిన ఐక్యత, సానుభూతిని కాన్సుల్ జనరల్ ప్రశంసించారు. న్యాయం జరుగుతుందని, ఈ భయంకరమైన నేరానికి పాల్పడిన నిందితులు పట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. గుర్విందర్ నాథ్ 2021లో భారత్ నుంచి కెనడాకు వెళ్లాడు. అతను తన చివరి సెమిస్టర్ బిజినెస్ స్కూల్‌ని పూర్తి చేశాడు. గుర్విందర్ నాథ్ జ్ఞాపకార్థం మిస్సిసాగాలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో 200 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. గర్విందర్ వాహనాన్ని దొంగలించాలనే ప్రణాళికతోనే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. గుర్విందర్ దాడి అనంతరం ఓ దుండగుడు గుర్పిందర్ వాహనాన్ని తీసుకెళ్లాడు.
ఐదు కిలోమీటర్ల దూరం తర్వాత ఆ వాహనాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని ఫొరెన్సిక్ ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. జులై 27 గుర్విందర్ నాథ్ మృతదేహం భారత్ కు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. గతంలోనూ చాలా మంది భారతీయలపై దాడులు జరిగాయి.












Click it and Unblock the Notifications