NRI News: రక్తం వాంతులు అవుతున్నాయి.. తెలుగు వ్యక్తి రోదన.. స్పందించిన మంత్రి లోకేశ్..
ఉన్న ఊరిలో ఉపాధి కరువై చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు. అయితే కొంత మంది మోసగాళ్లు అమాయికులను మోసం చేస్తూ డబ్బులు తీసుకుని గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. తీర అక్కడికి వెళ్లాక తెలుగు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిగా జీతం లేక, తిండి లేక నానా కష్టాలు పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్లు.. అక్కడ మంచి పని.. జీతం ఎక్కువ అని చెబుతారు.
కానీ అక్కడి వెళ్లాక చాలా ఇబ్బందులు ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను కువైట్ చిక్కుకుపోయానని రోదించాడు. ఏడారిలోకి తీసుకెళ్లి పడేశారని.. అక్కడ ఆహారం, విద్యుత్ సరిగా ఉండదని.. నరకం అనుభవిస్తున్నట్లు వీడియోలో చెప్పాడు. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆ వ్యక్తిని ఇండియాకు వచ్చేలా కృషి చేశారు.

తాజాగా గల్ఫ్ లో ఉన్న ఓ తెలుగు వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. సరెల్ల వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. ఓ ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు చెప్పాడు. తనకు ఖతార్ అని చెప్పి తీసుకెళ్లి సౌదీ అరేబియాలో వదిలేశారని తెలిపాడు. జులై 10న ఖతార్ వచ్చినట్లు చెప్పాడు. ఆ తర్వాత 11వ తేదీన సాయంత్రం సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చి వదిలేశారని వివరించాడు. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు.
Veerendra, we will bring you back home safely! Don't worry! https://t.co/GKk9j4n64R
— Lokesh Nara (@naralokesh) July 19, 2024
రక్తం వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తను ఏజెంట్ కు రూ.1.70 ఇచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం తాను చనిపోయే పరిస్థితిలో ఉన్నట్లు వీడియోలో రోదించాడు. ఈ వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించాడు. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువస్తాం వీరేంద్రా! డోంట్ వర్నీ అంటూ ట్వీట్ చేశారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications