ఈగల్ టీమ్ కే చుక్కలు చూపిస్తున్న గంజాయి క్వీన్ నీతూబాయి.. అనుష్క 'ఘాటి'ని మించి!

గంజాయి స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ఆమె ఒక తిరుగులేని శక్తి. పోలీసుల కళ్లుగప్పి, నిఘావర్గాలను బోల్తా కొట్టిస్తూ గంజాయి నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న లేడీ డాన్. ఆమే ధూల్‌పేటకు చెందిన గంజాయి క్వీన్ నీతూబాయి. హైదరాబాద్ నగరంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు తెలంగాణప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 'ఈగల్ టీమ్'. ఎందరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆటకట్టించిన ఈ డేగ కళ్ల ఈగల్ టీమ్‌కే నీతూబాయి చుక్కలు చూపిస్తోంది.

ఎవరీ నీతూబాయి? ఆమె నెట్‌వర్క్ ఎలాంటిది?

హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, మంగళ్‌హాట్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నీతూబాయి గత కొన్నేళ్లుగా తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించింది. కేవలం స్థానికంగానే కాకుండా, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల నుంచి భారీగా గంజాయిని అక్రమ మార్గాల్లో నగరానికి రప్పించడంలో ఆమె దిట్ట. ఈమె కింద పనిచేసేందుకు ఒక పెద్ద నెట్‌వర్క్ ఉంది. ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలురను క్యారియర్లుగా వాడుకుంటూ పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంది.

ganja queen neethubhai absconded again eagle team in search for the lady don of drugs in hyderabad

ఈగల్ టీమ్‌కు సవాల్‌గా మారిన లేడీ డాన్

ఇళ్లకు సరఫరా చేసే కిరాణా సామాగ్రి, కూరగాయల సంచులు, చివరకు పసిపిల్లల దుస్తుల్లో కూడా గంజాయిని దాచి రవాణా చేయించడంలో ఆమె సిద్ధహస్తురాలు. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈగల్ టీమ్.. నీతూబాయిని పట్టుకోవడానికి పక్కా వ్యూహాలు రచించింది. సాంకేతిక నిఘా, ఫోన్ లొకేషన్ల ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి వెళ్లిన ప్రతిసారీ పోలీసులకు నిరాశే ఎదురవుతోంది.

నీతూబాయి చాలా షార్ప్

ఎందుకంటే నీతూబాయి ఒకే నంబర్‌ను ఎక్కువ రోజులు వాడదు. అలాగే నగదు లావాదేవీలు కాకుండా కేవలం హవాలా ద్వారా మాత్రమే అందుకుంటుంది. ఇటీవల ఈగల్ టీమ్ ఆమె అడ్డాపై మెరుపు దాడి చేసినప్పటికీ, ఆమెకు ఇన్ఫార్మర్లు బలంగా ఉండటంతో ఆమె తృటిలో తప్పించుకుంది. పోలీసుల కదలికలను ముందే పసిగట్టేలా ఆమె తన అనుచరులను గల్లీ గల్లీలో ఏర్పాటు చేసుకుంది.

ఐటీ ఉద్యోగులకు కిరాణా షాప్ ముసుగులో గంజాయి విక్రయాలు..

ఇటీవల నానక్ రాంగూడలోని నీతూబాయి ఇంటి దగ్గర ఒక గంట వ్యవధిలోనే ఏకంగా 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ టీమ్ పట్టుకుంది. ధూల్‌పేట్ నుంచి మకాం మార్చేసి.. ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉండే ప్రాంతంలో తన అడ్డాను ఏర్పాటు చేసుకున్న నీతూబాయి.. కిరాణా షాపు ముసుగులో భారీగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దాడుల్లో గుర్తించారు.

మళ్ళీ తప్పించుకున్న నీతూబాయి

నిత్యం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి విక్రయాలను నీతూబాయి కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నీతూబాయిని ఈ సారి కూడా పట్టుకోలేకపోయారు. గతంలో నీతూ బాయిని పోలీసులు అరెస్ట్ చేసి.. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలుకు వెళ్లి బయటికి వచ్చిన నీతూబాయి.. మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. ఈ డ్రగ్‌ డాన్‌ను పట్టుకునేందుకు ఈగల్ ఫోర్స్‌ అన్ని చర్యలు చేపట్టింది.

తెలంగాణా మీ అయ్య జాగీరా అనటం తప్పా? సమర్ధించుకున్న పవన్ కళ్యాణ్
తెలంగాణా మీ అయ్య జాగీరా అనటం తప్పా? సమర్ధించుకున్న పవన్ కళ్యాణ్

ఈగల్ టీమ్ కు ఛాలెంజ్ విసురుతున్న నీతూబాయి

ఈగల్ టీమ్ ఒక అడుగు ముందుకు వేస్తే, ఆమె రెండు అడుగులు ముందే ఉంటోంది. నీతూబాయి ఇస్తున్న సవాళ్లతో ఈగల్ టీమ్ ఇప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఆమె ప్రధాన అనుచరులను, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఆమెను ఒంటరిని చేయాలని చూస్తున్నారు. ధూల్‌పేట్ పరిసరాల్లో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేశారు. త్వరలోనే పట్టుకుంటాం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+