NRI News: నకిలీ వీసాతో యువకుడిని మోసం చేసిన వీసా కన్సల్టెన్సీ..

విద్యార్థి వీసా ఇప్పిస్తానంటూ ఓ యువకుడు వీసా కన్సల్టెన్సీ చెందిన ఓ వ్యక్తి మోసం చేశాడు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. ఆనంద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. యువకుడి వద్ద వీసా కోసం రూ.8.50 లక్షలు వసూలు చేశాడు నిందితులు.
నెక్స్ట్ డెస్టినేషన్‌కు చెందిన సక్లెన్ అలియాస్ అమన్ దివాన్ యూకే నుంచి నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి పాస్‌పోర్ట్‌పై యూకే స్టూడెంట్ వీసా స్టిక్కర్‌ను అతికించినట్లు వెలుగులోకి వచ్చింది.

ఆనంద్ జిల్లాకు చెందిన కృపాల్ అనే యువకుడు పై చదువుల కోసం యూకే వెళ్లాలనుకున్నాడు. దాని కోసం అతను నెక్స్ట్ డెస్టినేషన్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. వీసా కోసం రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని కన్సల్టెన్సీ వారు చెప్పారు. రూ.8.50 లక్షలు చెల్లించిన యువకుడు.. అడ్మిషన్, వీసాతో పాస్‌పోర్ట్ పొందాడు. అయితే ఆ స్టాంప్ బోగస్ అని యువకుడు అనుమానించాడు. దీంతో ఆ యువకుడు విచారణ జరిపి తనకు వచ్చిన వీసా నకిలీదని గుర్తించాడు.

A visa consultancy in Gujarat cheated a young man by giving him a fake visa

ఈ ఘటనపై యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఆనంద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆనంద్ ఎస్‌ఓజి పోలీసులు నిందితుడు సక్లైన్ అలియాస్ అమన్ దివాన్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో ఉన్న సమయంలో ఓ షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సక్లెన్ అలియాస్ అస్ గత రెండున్నర, మూడేళ్లుగా నెక్స్ట్ డెస్టినేషన్ పేరుతో వీసా కార్యాలయాన్ని తెరిచి నకిలీ వీసాలు అందిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+