NRI News: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ మహిళ.. రక్షించాలంటూ వేడుకోలు..
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ బహ్రెయిన్ దేశంలో చిక్కుకుపోయారు. అక్కడ చిక్కుకుపోయిన తన 34 ఏళ్ల కూతురు షహీన్ బేగంను ఇండియాకు తీసుకురావాలని ఆమె తల్లి కోరుతున్నారు. ఇందుకోసం ఆమె భారత విదేశాంగ మంత్రి (MEA) డాక్టర్ ఎస్ జైశంకర్‌ను లేఖ రాసింది. మే 7 మంగళవారం నాడు ఎంబీటీ నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ ద్వారా షాహీన్ తల్లి జులేకా బీ ప్రభుత్వానికి రాసిన లేఖ, వీడియో సందేశాన్ని X లో షేర్ చేశారు.
కాలాపత్తర్ నివాసి అయిన షాహీన్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లానుకుంది. అదే సమయంలో షాహీన్ నగర్, రాజేంద్ర నాగా నివాసితులు ఇద్దరు ఏజెంట్లు ఫాతిమా, యూనస్ ఆమెను సంప్రదించారు. వారు ఆమెకు బహ్రెయిన్‌లో 130 బహ్రెయిన్ దినార్ (రూ. 28,802) నెల జీతంతో ఇంటి పనిమనిషి ఉద్యోగం ఉందని చెప్పారు. దీంతో తాను బహ్రెయిన్ వెళ్తానని షాహీన్ చెప్పారు.

దీంతో ఏజెంట్లు షాహీన్ వద్ద డబ్బు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం షహీన్‌ను మార్చి 15, 2024 న విజిట్ వీసాపై ఒమన్‌లోని మస్కట్‌కు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఆమెను హౌస్‌మెయిడ్ వీసాపై బహ్రెయిన్‌కు తీసుకెళ్లారు. బహ్రెయిన్‌లో ఆమెను మరొక ఏజెంట్ కలుసుకున్నారు. షహీన్ కు మానసిక అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళను చూసుకునే పని అప్పగించారు. అయితే ఆ వృద్ధ మహిళ తన కూతురును హింసిస్తుందన జులేకా బీ చెప్పారు.
ఆమె అక్కడ పని చేయడానికి కష్టపడుతోందని పేర్కొన్నారు. తన కుమార్తెకు సరైన ఆహారం కూడా పెట్టడం లేదన్నారు. పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు చెప్పారు. తన కుమార్తెను తిరిగి ఇండియాకు తీసుకురావాలని జులేకా బీ విదేశాంగ శాఖను కోరుతున్నారు. తనను రక్షించమని షాహీన్ ప్రభుత్వానికి విన్నవించింది.
Audio message of Shaheen Begum and vedio appeal of her mother Zuleqa Begum appealing EAM to rescue her as soon as possible. pic.twitter.com/xyQnYudTPO
— Amjed Ullah Khan MBT (@amjedmbt) May 7, 2024












Click it and Unblock the Notifications