NRI News: తప్పిపోయి 12 రోజుల తర్వాత దొరికిన ఎన్నారై..
ముంబైలో ఓ ఎన్నారై తప్పిపోయి 12 రోజుల తర్వాత దొరికాడు.
జ్ఞాపకశక్తి లోపంతో డర్బన్‌లో రిటైర్డ్ క్లర్క్ అయిన అరవై తొమ్మిదేళ్ల ధ్రామలింగం పిళ్లే జనవరి 31న సహర్‌లోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పిపోయారు. 12 రోజుల తర్వాత అతని ఆచూకీ లభించింది. దీంతో అతన్ని అతని కూతురుకు అప్పగించారు.ఇద్దరు వ్యక్తుల సహాయంతో పిళ్లే ఆదివారం నాడు 14వ రోడ్డులో తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో రోడ్డుపై తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
ముంబై మిర్రర్‌లో పిళ్లేపై వచ్చిన కథనాన్ని చదివి తెలుసుకున్న మరొక నివాసి.. పిళ్లేను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ద్రమలింగం పిళ్లే(69) అతని కుమార్తె రబెక్కా 12 రోజుల నిరీక్షణ తర్వాత దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లారు. పిళ్లై స్వల్పకాలిక జ్ఞాపకశక్తితో బాధపడుతున్నారని, బెంగళూరులోని స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇద్దరూ భారత్‌కు వచ్చామని అతని కూతరు రాబెక్కా తెలియజేసింది.

రబెక్కా తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదుతో సహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ గోవిల్కర్, ఇన్‌స్పెక్టర్ విశాల్ పాదిర్, సబ్-ఇన్‌స్పెక్టర్ సుశాంత్ బవాచ్కర్‌లతో కూడిన 35 మంది పోలీసుల బృందం రైల్వే స్టేషన్‌లు (ముంబై, థానే, నవీ ముంబై), ఆసుపత్రులు, శవాగారాల నుంచి వివరాలను సేకరించారు. షెల్టర్ హోమ్‌లు, బిచ్చగాళ్ల సంఘం, NGOలు, విమానాశ్రయం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న CCTV కెమెరా దృశ్యాలు పరిశీలించారు. చివరికి పిళ్లే ఆచూకీ కనుగొన్నారు.
సహార్ పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తె రబెక్కాను చూసి పిళ్లే ఏడ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో ఖార్ 14వ రోడ్డులో జి గోమ్స్‌కి పిళ్లే కనిపించాడు. గోమ్స్ పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి పిళ్లే గురించి తెలియజేశాడు. ఖర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్ నింబాల్కర్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కాన్సే జోనల్ అక్కడికి చేరుకుని పిళ్లేను పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications