నేపాలీ, భూటాన్ శరణార్థులకు ‘అన్నదాత’

న్యూయార్క్: అమెరికాలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేద వృద్ధులకు ఆహారాన్ని అందించే ప్రధాన ఉద్దేశంతో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నదాత ఛారిటీస్ లిమిటెడ్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేగాక అమెరికాలోని డల్లాస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నట్లు వారు చెప్పారు. నవంబర్ 28న ఫోర్ట్ వర్త్ హిందూ ఆలయంలో 50 మంది నేపాలీ, భూటన్ శరణార్థులకు భారత ఆహార ధాన్యాలను అందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్-అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ నాయకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. 10 ఎల్‌బిఎస్ బియ్యం, 10 ఎల్‌బిఎస్ పప్పు ధాన్యాలు, 20 ఎల్‌బిఎస్ గోధుమ పిండి, 10 ఎల్‌బిఎస్ ఆలుగడ్డలు, 1 ఎల్‌బి పచ్చడిని ఒక్కో కుటుంబానికి ప్రసాద్ తోటకూర చేతులమీదుగా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. అమెరికాలోని, ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు ఇలాంటి సేవలందిస్తున్న అన్నదాత సంస్థ నిర్వాహకులైన భాస్కర్ రెడ్డి, రాజా రెడ్డిలను ఈ సందర్భంగా ప్రసాద్ తోటకూర అభినందించారు.

Annadata support programs in the United States

మరో 200 మంది నేపాలీ, భూటాన్ శరణార్థులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు పుష్ప, గిరిధర్ ముండ్లూరిలకు ప్రసాద్ తోటకూర వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకులు డాక్టర్ విశ్వనాథం పులిగండ్ల, డాక్టర్ జగన్నాథరావు, విష్ పాలెపు, యెజి జయంతి, పూర్ణ నెహ్రూ మాట్లాడుతూ.. అవసరమున్న వారికి సహాయం అందిస్తున్న అన్నదాత నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఈడబ్ల్యూఏ, డిఎఫ్‌డబ్ల్యూ చాప్టర్ నుంచి పలువురు వాలంటీర్లుగా సేవలందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కృష్ణమోహన్ పుట్టపర్తి, కుమార్, శిరీషారెడ్డి, నగేష్ బాబు, దేవేందర్, సరోజారెడ్డి, సంధ్యారెడ్డి, మీడియాకు ప్రసాద్ గుజ్జు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాత సంస్థ ఛైర్మన్‌గా భాస్కర్ రెడ్డి, కార్యదర్శి వీర చింత, కోశాధికారి రాజారెడ్డి, సంయుక్త కోశాధికారి కెఎస్ఎన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సుధీర్ మేడపాటి, బోర్డ్ ట్రస్టీలుగా పూర్ణ నెహ్రూ, సతీష్ కర్రీలు వ్యవహరిస్తున్నారు. విరాళాలు అందించాలనుకునే వారు సంస్థ వెబ్ సైట్ annadhata.net సంప్రదించవచ్చని వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+