సిక్కు ప్రొఫెసర్‌పై దాడి: మద్దతుకు కృతజ్ఞతలు

దాడికి సంబంధించి ప్రభుజోత్ సింగ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత శనివారం రాత్రి 8గంటల సమయంలో ఎగువ మ్యాన్ హట్టన్ దగ్గర దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. తన స్నేహితుడు, అతని భార్య, కొడుకును వారుంటున్న అపార్ట్ మెంటు వద్ద చేర్చిన తర్వాత నడుచుకుంటూ వెళుతుండగా తనను 12 నుంచి 15మంది యువకులు వెంబడించినట్లు ప్రభుజోత్ తెలిపారు.
ఉగ్రవాది, ఒసామాను పట్టుకోండని అరుస్తూ తనపై దాడి చేశారని ప్రభుజోత్ చెప్పారు. వారి దాడిలో గాయపడి అక్కడే కిందపడిపోయినట్లు తెలిపారు. అక్కడి చేరుకున్న ముగ్గురు వ్యక్తులు దాడి నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుజోత్ చెప్పారు. తన దవడ ఎముక విరిగిందని, ముఖంపై తీవ్రంగా గాయాలైనట్లు ఆయన చెప్పారు.
ఘటనపై టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు విచారణ ప్రారంభించినట్లు ప్రభుజోత్ తెలిపారు. నిందుతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు ఘటనలో 12మంది యువకులు పాల్గొన్నట్లు నిర్ధారించారు. బాధితునిపై ఆరుసార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గడ్డం, తలపాగా ధరించడం కారణంగా దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కాగా శాంతికాముకులుగా జీవించే సిక్కు కమ్యూనిటీపై దాడులను పలువురు ఖండించారు. గతంలో కూడా సిక్కులపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలున్నాయి. సిక్కు కమ్యూనిటీ ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుందని ప్రభుజోత్ సింగ్ చెప్పారు. తనపై దాడిని ఖండించి తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రభుజోత్ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications