Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌కు యువజన పురస్కార్ అవార్డు, సామాజిక సేవకు గుర్తింపు

ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పొట్ట కూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారిని ఆపన్న హస్తం అందిస్తున్నారని కొనియాడారు. బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ చేస్తున్న సేవలకు యువజన సంఘాల సమితి అభినందించింది.

స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను అభినందించింది. ఇవాళ శనివారం కోరుట్ల కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో సత్కారించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ తరఫున ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్ పాల్గొన్నారు. ఆయనకు రాష్ట్ర యువజన పురస్కార్-2021 అవార్డును అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మగ్గిడి రాజేందర్‌కు శాలువాకప్పి.. పుష్ఫగుచ్చం అందజేసి సత్కరించారు.

bahrain nri trs cell taken yuvajana puraskar 2021 award

ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్ పొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్.. బృందం కలిసి సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. విదేశాల్లో చనిపోయిన వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేస్తున్నారు. తనకు యువజన పురస్కార్-2021 అవార్డు రావడం సంతోషంగా ఉంది అని మగ్గిడి రాజేందర్ అభిప్రాయపడ్డారు. తమ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు. మగ్గిడి రాజేందర్‌ను బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ సహచర జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, సెక్రటరీలు సీహెచ్ రాజేందర్, ఉత్కం కిరణ్ అభినందించారు.

bahrain nri trs cell taken yuvajana puraskar 2021 award

సన్మాన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావ వసంత, కల్వకుంట సంజయ్ కుమార్, ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ రవి, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య పాల్గొని.. బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. సన్మాన కార్యక్రమంలో మగ్గిడి నరేందర్, మగ్గిడి హరీశ్, ఆకు రాజ్ కుమార్, మ్యాకల రాజలింగం, గోరుమంతుల నరేశ్, గోరుమంతుల రఘు, గన్యారపు భూమేశ్, గన్యారపు మధు, గన్యారపు గోపి, గన్యారపు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+