లండన్‌లో బతుకమ్మ వేడుకలు
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా లండన్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు జరిగాయి. వెస్ట్ లండన్ లోని లాంప్టన్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు. రంగు రంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేసారు, విదేశాల్లో ఉన్నపటికీ సంప్రదాయ బద్దం గా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ప్రారంభించారు, విదేశాల్లో స్థిరపడ్డా కాని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది.
బతుకమ్మలని నిమ్మజ్జనం చేసి తదుపరి సాంప్రదాయ బద్దంగా సద్దుల ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన "శమి చెట్టుకు" ప్రత్యేక పూజలు చేసారు, ప్రవాస తెలంగాణా సంస్థల చరిత్రలోనే ఇలా శమి చెట్టు తెచ్చి పూజ చెయ్యడం మొదటి సారి అని తెలిపారు. దాన్ని కార్యక్రమానికి హాజరైన తెలంగాణా బిద్దలందరూ దేన్ని ప్రశంసించారు. సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించందని పలువురు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు కు గొప్ప విశిష్టత ఉందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని, చివరి అంకం పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు.
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆదేశాల అనుగుణంగా రాష్ట్రం సాదించే వరకు పోరాటం కొనసాగుతుందని, వందల తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్క దగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాల సంతోషం గా ఉందని తెలిపారు. పిల్లల చే ఏర్పాటు చేసిన ఫాన్సి డ్రెస్ అందరిని అలరించింది. ఇందులో తెలంగాణ ప్రముకుల - జాతీయ స్థాయి ప్రముకుల వేషదారణ హైలైట్ గా నిలిచాయి. ఉత్తమ బతుకమ్మ లకు బహుమతులు అందజేశారు ప్రధమ - అర్చన, ద్వితీయ - శుశుమ్న రెడ్డి, తృతీయ - లావణ్య అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం కల్చరల్ -కం- ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ అంతటి, వెస్ట్ లండన్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, ఈవెంట్స్ కోఆర్డినేటర్ సిక్క చందు గౌడ్ అద్యక్షతన జరిగిన ఈ కరిక్రమంలో సభ్యులు పవిత్ర రెడ్డి, అర్చన జువ్వాడి, మీనాక్షి, నిర్మల,జ్యోతి, ప్రభలత, వాణి, సుహాసిని, అశోక్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రసాద్ తోట, రంగు వెంకట్, విక్రం రెడ్డి రేకుల, హరి నవపేట్, మల్లా రెడ్డి, జితేందర్, సుధాకర్ గౌడ్, శ్రీకాంత్ పెద్దిరాజు,శివాజీ షిండే,బలమురి సుమన్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మల్లేష్, చక్రి, విక్రం,మహేష్, రోహిత్ రావు, సునీల్ మంద తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications