వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో బతుకమ్మ వేడుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

చికాగో: తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి), ఆమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వారి ఆద్వర్యంలో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలను, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇల్లినొఇస్ రాష్ట్రం నలుమూలల నుండి 500 పైగా తెలుగువారు చికాగో లోని ఆరోర వెంకటేశ్వరస్వామి ఆలయప్రాంగణంలో బతుకమ్మ పండుగనుస దసరా పండుగలను శనివారం రోజు ఈ నెల 12వ తేదీన చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 11గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు అత్యంత ఉత్సాహంతో ఘనంగా జరిగాయి.

మధ్యాహ్నం భోజనం తరువాత చిన్నారులు, మహిళలు సాంప్రదాయబద్దంగా పట్టవస్త్ర్రాలు ధరించి, అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలతో చికాగో వాసులకు కన్నుల విందు చేశారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రం వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వారి వారి బతుమ్మలను మేలతాళాలు, భజంత్రిలతో గుడికొలనులో వదిలారు. ఈ పండుగకు రేలారెరేలా రవి ప్రత్యేక ఆకర్షనగా నిలిచి తన గీతాలతొ అందర్ని అలరించారు. రవి బతుకమ్మ గీతాలతో అందరిని హుషారు ఎత్థించారు.

Bathukamma celebrated by TAG and ATA

టిఎజిసి, ఆటా స్పాన్సర్ చేసిన బతుకమ్మ అమెరికాలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఈ వేడుకకు అవసరమైన పుష్పాలను ప్రత్యేకంగా న్యూజెర్సీలోని ఫ్యాన్సీ ఫ్లోరిస్టు నుండి తెప్పించారు. పద్మ మాదిరెడ్డి, జ్యోతి చింతలపాని, సుజాత అప్పలనేని ఆద్వర్యంలో ఈ అతి పెద్ద బతుకమ్మను చేశారు. ఈ అతిపెద్ద బతుకమ్మను మినహాయించి మిగతా బతుకమ్మలలో శిరీష సరికొండ, స్రీలత పర్వతాల, ప్రనిత కందిమల్లలు చేసిన బతుకమ్మలను ప్రథమ, ద్వితీయ, తృతీయ పెద్ద బతుకమ్మలుగా ఈక్రమంలో ఎంపిక చేశారు. వీటికి భారతి పుల్లూర్, వనజ నెట్టెం, శ్రీదేవి దొంతిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఈ బహుమతులను న్యూ యార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు స్పాన్సర్ చేసి, ఆటా వ్యవస్థాపకులు హన్మంత రెడ్డి, మాధవ రెడ్డి చేతులమీదుగా అందచేశారు. వీటితో పాటు ప్రతి బతుకమ్మకు భారతదేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన దేవి విగ్రహాలను టిఎజిసి అద్యక్షుడు రమేష్ గారపాటి అందచేశారు.

సాయంత్రం గుడి పూజారి, వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి ఆయుధ పూజ చేశారు. వచ్చిన వారందరకి కంకణాలు కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసు కొన్నారు. వచ్చిన వారందరూ జమ్మి ఆకులను పంచి పరస్పరం ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ వేడుకలు భారత దేశంలోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో అద్యక్షులు రమేష్ గారపాటి, ఆటా అద్యక్షులు కరుణాకర్ మాధవరం, ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, ధాతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుక విజయవంతం కావడానికి అహర్నిశలు కృషిచేసిన జ్యోతి చింతలపని, పద్మ మాదిరెడ్డి, ఆటా కోశాధికారి నరేందర్ రెడ్డి చేమర్ల, ఆటా ప్రాంతీయ సమన్వయకర్త శ్రీనివాస్ మట్ట , ఆటా బిఓటి సత్య కందిమళ్ళ, టిఎజిసి కార్యదర్సి సుజాత అప్పలనేని, టిఎజిసి ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ పెదమల్లు, అంజి కందిమళ్ళ, ప్రదీప్ కందిమళ్ళ, జగన్ బుక్కరాజు, రామ్ అదే, హరి రైనీ, శివ పసుమర్తి, శ్రీనివాస్ బొమ్మినేని, అమర్ నెట్టెం మరియు శ్రీనివాస్ సరికొండ, శ్రీనివాస్ చాడ లను అభినందించారు.

English summary
Dasara and Bathukamma festival has been Celebrated in Chicago in USA by ATA and TAGC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X