వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఘనంగా సీతారాముల కళ్యాణం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలో సీతారాముల కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణోత్సవాలను మిచిగాన్ రాష్ట్రం నోవీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో, ఒహియా రాష్ట్రంలో కొలంబస్ నగరంలోని భారతీయ హిందూ దేవాలయంలో శని, ఆదివారాల్లో వైభవంగా నిర్వహించారు.

భద్రాచల ఆలయ వేదపండితులు సీతారామానుజాచార్యులు, మురళీ కృష్ణమాచార్యులు, రామస్వరూపరాఘవాచార్యులు, తదితర పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరించారు.

నోవీలో జరిగిన కళ్యాణోత్సవానికి కళ్యాణోత్సవ కన్వీనర్, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావు, ఆలయ ఛైర్మన్ రామకృష్ణ ప్రసాద్, అధిక సంఖ్యలో తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు.

ఒహియా రాష్ట్రంలోని కొలంబస్‌లో తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియా(టిఏడిఓ) సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి సుమారు 600 తెలుగు కుటుంబాలు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. టిఏడిఓ అధ్యక్షుడు శ్రీధర్ కేసాని ప్రవాసాలకు స్వాగతం పలికారు.

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలో సీతారాముల కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం

అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణోత్సవాలను మిచిగాన్ రాష్ట్రం నోవీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో, ఒహియా రాష్ట్రంలో కొలంబస్ నగరంలోని భారతీయ హిందూ దేవాలయంలో శని, ఆదివారాల్లో వైభవంగా నిర్వహించారు.

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం

భద్రాచల ఆలయ వేదపండితులు సీతారామానుజాచార్యులు, మురళీ కృష్ణమాచార్యులు, మస్వరూపరాఘవాచార్యులు, తదితర పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరించారు.

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం

ఒహియా రాష్ట్రంలోని కొలంబస్‌లో తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియా(టిఏడిఓ) సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.

English summary
Telugu association of Central Ohio (TACO) & TANA with the support of Bharateeya Hindu Temple has organised and Bhadrachala Sita Rama Kalyanam was conducted in a grand manner on Sunday, 10 Aug 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X