అమెరికా-హైదరాబాద్ నేరుగా విమానం: ప్రవాసుల వినతిపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే?

వాషింగ్టన్: అమెరికాలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది తెలుగువారు అక్కడ స్థిరపడ్డారు. కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అక్కడి తెలుగువారు కలిశారు. హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని యూఎస్ఏ ఎన్నారైలు వినతి పత్రం అందించారు.

ఢిల్లీ, ముంబై వంటి చాలా ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన కనెక్షన్లను కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో యూఎస్ఏ-హైదరాబాద్ మధ్య నేరుగా విమానాలు నడపడం పట్ల పెద్ద నగరాలతో సమానంగా అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రవాసులు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

Direct flight between America and Hyderabad: NRI requests to Union minister Kishan Reddy

అమెరికా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని భారత పర్యాటక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రవాస భారతీయులు. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయడంతోపాటు కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృసి చేస్తోందని.. కేంద్ర విమాన శాఖ మంత్రితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

కాగా, కిషన్ రెడ్డితో న్యూయార్క్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డికి టీడీఎఫ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని, కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఉందని వారు అభిప్రాయపడ్డారు. అమరుల ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామని ప్రవాసులు తెలిపారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు మురళీ చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+