NRI News: అమెరికాలో అనుమానాస్పదస్థితిలో భారత సంతతి కుటుంబ సభ్యుల మృతి..
యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో లో దారుణం జరిగింది. భారతీయ సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పదస్థితిలో చనిపోయినట్లు గుర్తించారు. రాకేష్ కమల్ (57)తో పాటు ఆయన భార్య టీనా కమల్ (54), కుమార్తె ఆరియానా (18) ఇంట్లోనే మరణించారు. మృతదేహాలు గురువారం సాయంత్రం బోస్టన్ సమీపంలోని వారి డోవర్ మాన్షన్‌లో గుర్తించామని నార్ఫోక్ జిల్లా అటార్నీ మైఖేల్ మోరిస్సే అన్నారు.
గురువారం సాయంత్రం 7.30గంటల సమయంలో రాకేష్ కుటుంబ సభ్యులు నివాసం డోవర్ భవనంలో మృతి చెందినట్లు పేర్కొన్నారు.టీనా, ఆమె భర్త గతంలో ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నడుపుతున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులు కాల్చి చంపరా లేదా అనేది తెలియాల్సి ఉందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. పోస్ట్ మార్టం ఫలితాలు వచ్చే వరకు ఇది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలుతుందని మైఖేల్ మోరిస్సే అన్నాడు.

విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించ లేదని మోరిస్సే చెప్పారు. ప్రస్తుతం ఈ హత్యలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ సంఘటనను హత్య లేదా ఆత్మహత్యగా పేర్కొనాలా వద్దా అని నిర్ణయించే ముందు మెడికల్ ఎగ్జామినర్ తీర్పు కోసం తాను వేచి ఉన్నానని మోరిస్సే చెప్పారు.రాకేష్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణానికి ఆర్ధిక సమస్యలే కారణమని తెలుస్తోంది.
సంబంధిత ఆన్‌లైన్‌లోని ఆధారాల్ని స్థానిక పోలీసులు సేకరించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, ఇతర సమస్యలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. "దర్యాప్తు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యం బయటి పక్షాల ప్రమేయాన్ని సూచించదు" అని జిల్లా న్యాయవాది కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కుటుంబం విశాలమైన భవనం, విలువ $5.45 మిలియన్లుగా అంచనా వేశారు. 2019లో కమల్‌లు 11 బెడ్‌రూమ్‌లు కలిగిన 19,000 చదరపు అడుగుల ఎస్టేట్‌ను 4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications