వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో గాంధీ విగ్రహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డల్లాస్: అమెరికాలోని ఇర్విన్‌లోని జాఫర్సన్ పార్క్‌లో ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ(శంకుస్థాపన) నిర్వహించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ కరోలినా గవర్నర్ నిక్కి హోలే, ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డునే, హూస్టర్ భారత కాన్సలర్ జనరల్ పర్వతనేని హరీశ్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా ఆవరణలో భారీ కాంస్య గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ప్లాజా ఆవరణలో మహాత్మా గాంధీ, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూ., నెల్సన్ మండేలా, అల్బర్ట్ ఐన్‌స్టీన్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల సందేశాలను రాసి ఉంచనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న(గాంధీ జయంతి) సందర్భంగా ప్లాజా ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.

ప్రారంభోత్సవ కార్యక్రామనికి మహాత్మా గాంధీ కుటుంబ సభ్యులు, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కుటుంబ సభ్యులు, అమెరికా నుంచి, భారతదేశం నుంచి ఇతర ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు నార్త్ టెక్సాస్ మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎంఎన్‌టి) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చు అవుతుందని, ఇందుకు పలువురు నుంచి నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు. విరాళాలు అందించాలనుకునే వారు www.mgmnt.org లేదా 817-300-4747(ప్రసాద్ తోటకూర) లేదా [email protected] సంప్రదించవచ్చని తెలిపారు.

భూమి పూజ కార్యక్రమంలో సౌత్ కరోలినా గవర్నర్ నిక్కి హోలే, ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డునే, హూస్టర్ భారత కాన్సలర్ జనరల్ పర్వతనేని హరీశ్, ప్రసాద్ తోటకూర ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంజిఎంఎన్‌టి ఉపాధ్యక్షులు తయబ్ కుండవాలా, స్వామి షా, సెక్రటరీ రావు కల్వల, ట్రెజరర్ దిలిప్ పటేల్, డైరెక్టర్ పియూష్ పటేల్, షబ్నమ్ మొడ్గిల్, జాక్ గోధ్వాని, పాల్ పాండియన్, ఫండ్ రైజింగ్ ఛైర్స్ జాన్ హోమండ్, సుధీర్ పరీఖ్, కుంతేష్ ఛోస్కి, అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్స్ పద్మశ్రీ ఏకె మాగో, ప్రొఫెసర్ కారోలిన్ బ్రిటిల్, ఎంవిల్ ప్రసాద్ పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

అమెరికాలోని ఇర్విన్‌లోని జాఫర్సన్ పార్క్‌లో ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ నిర్వహించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ కరోలినా గవర్నర్ నిక్కి హోలే, ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డునే, హూస్టర్ భారత కాన్సలర్ జనరల్ పర్వతనేని హరీశ్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా ఆవరణలో భారీ కాంస్య గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా'కు భూమి పూజ

ప్లాజా ఆవరణలో మహాత్మా గాంధీ, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూ., నెల్సన్ మండేలా, అల్బర్ట్ ఐన్‌స్టీన్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల సందేశాలను రాసి ఉంచనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న(గాంధీ జయంతి) సందర్భంగా ప్లాజా ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.

English summary
The Ground Breaking Ceremony of ”Mahatma Gandhi Memorial Plaza" in Thomas Jefferson Park, Irving happened today, Saturday, May 3, 2014 in Irving, TX.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X