ఎన్నారైల క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ ఎన్నారై ఫోరం 2014 క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ జెఎసి చైర్మన్ ఆచార్య శ్రీ కోదండ రామ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు దేవి ప్రసాద్, అద్దంకి దయాకర్, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ సంయుక్తంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోదండ రామ్ మాట్లాడుతూ - తెలంగాణా ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అధ్బుతమని కొనియాడారు. తెలంగాణా సాహిత్య ఉద్యామానికి ఎన్నారైలు చేసిన సేవలను గుర్తు చేశారు.

హరీష్ రావు మాట్లాడుతూ - విదేశాలలో తెలంగాణా సంస్కృతి పండుగలు చేసి మన సాంప్రదాయాలను, ముఖ్యంగా బోనాలు, బతుకమ్మ పండుగల ఘనతను విదేశాలలో తెలంగాణ ఎన్నారై ఫోరం చాటి చెప్పిందని అన్నారు.
దేవీప్రసాద్ మాట్లాడుతూ - తెలంగాణ జెఎసి ఇచ్చిన ప్రతి పిలుపును లండన్‌లో అమలు చేసిన ఎన్నారై ఫోరం కృష్టిని ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు గోలి తిరుపతి, కొక్కు వినయ్, నరేష్, సుభాష్, ప్రవీణ్, చల్ల ప్రశాంత్ పాల్గొని విజయవంతం చేశారు .












Click it and Unblock the Notifications