వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ అక్రమ రవాణా: ఎన్నారైకి 33 నెలల జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

Indian-American drug trafficker sentenced to 33 months in jail
లాస్ఏంజెల్స్: అమెరికాలో నిషేధిత డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన నేరం కింద అరెస్టయిన ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 33 నెలల జైలు శిక్ష విధించింది. అతడు దాదాపు 5 లక్షల డాలర్ల డ్రగ్స్ అక్రమ రవాణాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే.. లాంకాస్టర్‌కు చెందిన అమర్జిత్ ఐంగ్ గ్రేవల్(34) భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ అయిన బాత్ సాల్ట్స్, సింథటిక్ మరిజౌనా పదార్థాలను నిల్వ చేసుకుని వివిధ గ్యాస్ స్టేషన్లు, ఇతర స్టోర్లలో అమ్ముతున్నాడు.

2012లో గ్రాంట్‌విల్లె సమీపంలోని గ్యాస్ స్టేషన్ దగ్గర అండర్ కవర్ అధికారికి అరకిలో బాత్ సాల్ట్స్‌ను విక్రయించి కటకటాల పాలయ్యాడు అమర్జిత్ గ్రేవర్.

కాగా, గత గురువారం కేసు విచారించిన జిల్లా కోర్టు.. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గ్రేవర్‌కు 33 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడి వద్ద నుంచి సుమారు 5 లక్షల డాలర్ల విలువ చేసే డ్రగ్స్‌ను విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన కుల్వీందర్ సింగ్ గ్రేవల్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary

 A 34-year-old Indian-American has been sentenced to 33 months in jail and ordered to forfeit nearly USD 500,000 for distributing designer drugs in the US state of Pennsylvania.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X